Birthday: కాలేజ్ అమ్మాయి, బర్త్ డే రోజు బాయ్ ఫ్రెండ్ తో వెళ్లింది, అదే రోజే ప్రాణం పోయింది !
బెంగళూరు: కాలేజ్ లో చదువుతున్న యువతి మంచి ఉద్యోగం సంపాధించాలని ఆశపడింది. ఆర్థిక సమస్యలతో కాలేజ్ కు వెలుతూనే ఆ యువతి పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తోంది. కాలేజ్ చదువు పూర్తి అయిన తరువాత ఆమె ఉద్యోగం చేస్తూ ఆమె డబ్బులు ఆమె సంపాధించుకుంటున్నది. యువతి పుట్టిన రోజు సందర్బంగా ఇంట్లో తల్లిదండ్రులు ఆమెకు కొత్త దుస్తులు కొని ఇచ్చారు. బర్త్ డే రోజు ఉదయం నిద్రలేచిన యువతి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. తరువాత సమీపంలోని గుడికి వెళ్లి వచ్చిన యువతి తాను ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్నానని చెప్పింది. ఈ రోజు నీ బర్త్ డే, ఇంట్లో అందరితో కలిసి సంతోషంగా ఉండాలని, ఈ ఒక్కరోజు మాత్రం ఉద్యోగానికి వెళ్లకూడదని ఆమె తల్లి చెప్పింది. సాయంత్రం ఇంటికి త్వరగా వచ్చేస్తానని, రాత్రి ఏదైనా హోటల్ కు వెళ్లి అందరూ భోజనం చేద్దామని ఆ యువతి కుటుంబ సభ్యులకు నచ్చచెప్పింది. ఇంట్లో బయటకు వెళ్లకూడదని చెబుతున్నా ఆమె మాత్రం మొండిగా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఉద్యోగానికి వెళ్లకుండా బాయ్ ఫ్రెండ్ తో కలిసి బర్త్ డే వేడుకలు జరుపుకోవడానికి బైక్ లో బయలుదేరిన యువతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. బర్త్ డే రోజు ఇంట్లో వద్దని చెబుతున్నా మొండిగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదే రోజు ప్రాణాలు కోల్పోవడంతో అందరూ చలించిపోయారు.

కాలేజ్ అమ్మాయి
బెంగళూరులోని మల్లేశ్వరం సమీపంలో మహాశ్రీ అనే యువతి నివాసం ఉంటున్నది. మల్లేశ్వరం ప్రభుత్వ కాలేజ్ లో మహాశ్రీ చదువుకుంటున్నది. కాలేజ్ లో చదువుతున్న మహాశ్రీ మంచి ఉద్యోగం సంపాధించాలని ఆశపడింది. ఆర్థిక సమస్యలతో కాలేజ్ కు వెలుతూనే మహాశ్రీ పార్ట్ టైమ్ గా టెక్స్ టైల్స్ లో ఉద్యోగం చేస్తోంది.

కాలేజ్ అమ్మాయి బర్త్ డే
కాలేజ్ చదువు పూర్తి అయిన తరువాత మహాశ్రీ ఉద్యోగం చేస్తూ ఆమె డబ్బులు ఆమె సంపాధించుకుంటున్నది. మహాశ్రీ పుట్టిన రోజు సందర్బంగా ఇంట్లో తల్లిదండ్రులు ఆమెకు కొత్త దుస్తులు కొని ఇచ్చారు. బర్త్ డే రోజు ఉదయం నిద్రలేచిన మహాశ్రీ స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంది.

అమ్మ వద్దని చెబుతున్నా మొండిగా ?
ఇంట్లో పూజ చేసిన తరువాత సమీపంలోని గుడికి వెళ్లి వచ్చిన మహాశ్రీ తాను ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్నానని చెప్పింది. ఈ రోజు నీ బర్త్ డే, ఇంట్లో అందరితో కలిసి సంతోషంగా ఉండాలని, ఈ ఒక్కరోజు మాత్రం ఉద్యోగానికి వెళ్లకూడదని మహాశ్రీకి ఆమె తల్లి చెప్పింది. సాయంత్రం ఇంటికి త్వరగా వచ్చేస్తానని, రాత్రి ఏదైనా హోటల్ కు వెళ్లి అందరూ భోజనం చేద్దామని మహాశ్రీ ఆమె కుటుంబ సభ్యులకు నచ్చచెప్పింది.

ప్రియుడితో బైక్ లో వెళ్లింది..... ప్రాణాలు పోయాయి
ఇంట్లో బయటకు వెళ్లకూడదని చెబుతున్నా మహాశ్రీ మాత్రం మొండిగా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఉద్యోగానికి బయలుదేరిన మహాశ్రీని ఆమె చిన్నాన బీఇఎల్ బస్ట్ స్టాప్ వరకు డ్రాప్ చేశాడు. ఉద్యోగానికి వెళ్లకుండా బాయ్ ఫ్రెండ్ తో కలిసి బర్త్ డే వేడుకలు జరుపుకోవడానికి బైక్ లో బయలుదేరిన మహాశ్రీ బీఇఎల్ సర్కిల్ సమీపంలో బైక్ లో నుంచి కిందపడిపోయింది. ఆ సమయంలో వెనుక నుంచి వేగంగా వెళ్లిన క్యాంటర్ వాహనం మహాశ్రీ మీద దూసుకుపోవడంతో ఆమె అక్కడే దుర్మరణం చెందింది. బర్త్ డే రోజు ఇంట్లో వద్దని చెబుతున్నా మొండిగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహాశ్రీ అదే రోజు ప్రాణాలు కోల్పోవడంతో అందరూ చలించిపోయారు.












Click it and Unblock the Notifications