Birthday party: ఫ్రెండ్స్ తో ఎంజాయ్, విపరీతంగా మద్యం సేవించి చికెన్ తినేశాడు, నిద్రలో !
చెన్నై: కాలేజ్ లో చదువుకుంటున్న సమయంలో యువకుడికి చాలా మంది స్నేహితులు అయ్యారు. ఇంటి దగ్గర కూడా ఆ యువకుడికి చాలా మంది స్నేహితులు ఉన్నారు. డిగ్రీ పూర్తి చేసిన యువకుడు ఉద్యోగం చెయ్యకుండా స్నేహితులతో కలిసి జులాయిగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అర్దరాత్రి పీకలదాక మద్యం సేవించిన యువకుడు ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. రాత్రి నిద్రలోనే ఆ యువకుడి ప్రాణం పోవడంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు అసలు విషయం తెలుసుకుని హడలిపోయారు.

డిగ్రీ పూర్తి చేసిన యువకుడు
చెన్నై సిటీలోని వ్యాసరపాడి ప్రాంతంలో మహావిష్ణు అలియాస్ విష్ణు (21) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కాలేజ్ లో చదువుకుంటున్న సమయంలో విష్ణుకు చాలా మంది స్నేహితులు అయ్యారు. ఇంటి దగ్గర కూడా విష్ణుకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. డిగ్రీ పూర్తి చేసిన విష్ణు ఉద్యోగం చెయ్యకుండా స్నేహితులతో కలిసి జులాయిగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఫ్రెండ్ బర్త్ డే పార్టీ
విష్ణుకు రామ్ కుమార్ అనే స్నేహితుడు ఉన్నాడు. ఈనె 13వ తేదీ ఆదివారం రామ్ కుమార్ బర్త్ డే. ఉదయం రామ్ కుమార్ కు అతని స్నేహితులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. చెన్నైలోని రెట్టేరి 200 ఫీట్ రోడ్డులోని ఎస్ఆర్ఎం గ్రాండ్ లో రామ్ కుమార్ అందరికి బర్త్ డే పార్టీ ఇచ్చారు. విష్ణుతో పాటు అతని స్నేహితులు అందరూ బర్త్ డే పార్టీకి హాజరైనారు.

పీకలదాక తాగేసి చికెన్ రైస్ తినేసి నిద్రలోనే
బర్త్ డే పార్టీలో విష్ణు మోతాదుకు మించి మద్యం సేవించాడు. తరువాత అక్కడే విపరీతంగా చికెన్ రైస్, బిరియానీ, కబాబ్ తిన్నాడు. తరువాత స్నేహితులతో కలిసి విష్ణు ఇంటికి బయలుదేరాడు. అర్దరాత్రి దాటిని తరువాత విష్ణు ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. రాత్రి నిద్రలో విష్ణు చలనం లేకుండా ఉండటంతో అతని కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.

విష ప్రయోగం జరిగిందా ?
అయితే అప్పటికే విష్ణు ప్రాణం పోయిందని వైద్యులు చెప్పారు. విపరీతంగా ఆల్కాహాల్ తాగి మోతాదుకు మించి చికెన్, రైస్ తినడం వలనే విష్ణు ప్రాణం పోయిందని వైద్యులు చెప్పడంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు హడలిపోయారు. అయితే రాత్రి బర్త్ డే పార్టీలో ఏమైనా విష ప్రయోగం జరిగిందా ? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications