ఆమెకు 35, అతనికి 28.. భర్త లేని సమయంలో ఇంట్లోకి రావడంతో.. ముక్కులు కోసి..

వారిద్దరికీ వివాహేతర సంబంధం ఉంది. వారిని ఎలాగైన పట్టుకోవాలని స్థానికులు భావించారు. సమయం చూసి ఇద్దరిని దొరకబట్టారు. వారిని కొట్టడమే గాక మరోసారి ఇలాంటి తప్పు చేయొద్దని చెబుతూ ముక్కులు కోసి తగిన గుణపాఠం చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లాలో జరిగిన ఘటన చర్చానీయాంశమైంది.

వివాహేతర సంబంధం..

వివాహేతర సంబంధం..

ఫైజాబాద్ జిల్లా పత్రాంగ పోలీసు స్టేషన్ పరిధిలో గల కంద్ పిప్రాలో వివాహిత తన ఫ్యామిలీతో ఉంటోంది. అయితే భర్త ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. ఆమె ఒక్కరే ఉండటంతో అడ్డూ అదుపు లేకుండా పోయింది. దాంతో గ్రామానికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తీరు మార్చుకోవాలని వారిద్దరికీ పెద్దలు సూచించినా వినిపించుకోలేదు.

సమయం చూసి..

సమయం చూసి..

వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని భావించారు. వివాహిత ఇంటికొచ్చిన సమయంలో అదనుచూసి పట్టుకున్నారు. వారిద్దరికీ దేహశుద్ది చేశారు. అంతటితో ఆగకుండా వారి ముక్కులను కూడా కోశారు. భవిష్యత్‌లో ఇలాంటి తప్పు చేయకుండా ఇలా చేశామని పెద్దలు చెప్తున్నారు. విషయం తెలుసుకొని ఘటనాస్థలానికి పోలీసులు వచ్చారు. ముక్కులు కోయడంతో దీంతో రక్తస్రావమైంది. వెంటనే వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని చెప్తున్నారు.

టెన్షన్.. టెన్షన్..

టెన్షన్.. టెన్షన్..

వివాహిత-యువకుడు.. హిందూ-ముస్లింలు కావడం విశేషం. వారిద్దరినీ పట్టుకొని ముక్కు కోయడంతో గ్రామంలో శాంతి భద్రతలకు భంగం కలుగుతుందోనని పోలీసు బలగాలను మొహరించారు. వివాహిత మామ, ఇతరులు దాడి చేసినట్టు గుర్తించామని చెప్పారు. వారిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+