
Viral Video:వావ్.. స్మోక్డ్ చికెన్.. రెసిపీ ఇలా చేయండి, వైరల్.. సూపర్ టేస్ట్ అట..
నాన్ వెజ్ అంటే అందరికీ ఇష్టమే. అందులో ముఖ్యంగా చికెన్ అంటే అందరు లైక్ చేస్తారు. చికెన్‌ను కనీసం వంద రకాలుగా చేసే వీలుంది. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో చేస్తుంటారు. అయితే జస్టిన్ తామటన్ అనే వ్యక్తి మాత్రం చికెన్ వెరైటీగా చేశాడు. దానిని షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. టేస్ట్ కూడా బాగుంది.. బాగుండి ఉంటుందని కొందరు కామెంట్ చూశారు. చూస్తేనే నోరు ఊరుతుందని చెబుతున్నారు.

పిండిలో కలిపి..
చికెన్‌ను పిండిలో కలిపి వేయించాడు. అయితే మాములుగా పిండిలో కాదు.. ఆ పిండి పొగ పెట్టించి కలిపాడు. తర్వాత దానిని గ్రిల్‌కు పెట్టి.. మంచిగా వేయించాడు. దీనిని స్మోక్డ్ ఫ్లేవర్ అట.. వీడియో వైరల్ అవుతుంది. 3.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 160కే లైకులు కొట్టారు. ఈ చికెన్ తన జీవితాన్నే మార్చివేసిందని బ్లాగర్ రాసుకొచ్చాడు.

బట్టర్ మిల్క్..
తొలుత చికెన్ రెక్కలను బట్టర్ మిల్క్‌లో నాన బెట్టాలని సూచించారు. తర్వాత అప్పటికే స్మోక్డ్ పిండితో కలపాలని కోరారు. దానిని గ్రిల్‌కు పెట్టి.. మంచి రంగు వచ్చేవరకు అలాగే ఉంచాలని కోరారు. ఈ వీడియోకు చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు. ఇదీ చాలా డిపరెంట్ అని కొందరు అంటున్నారు.
క్రేజీ కాంబినేషన్
ఇదీ క్రేజీ కాంబినేషన్ అని ఒకరు కామెంట్ చేశారు. స్మోక్ చికెన్ టేస్ట్ ఎలా ఉంటుందని మరికొందరు అంటున్నారు. ఇందులో తేడా ఏముందని మరికొందరు కామెంట్ చేశారు. తన స్నేహితుడు చాకొలెట్ చిక్ కూకిస్ చేశాడని మరికొందరు పోస్ట్ చేశారు. మీరు ఎప్పుడూ పచ్చి పిండిని ఉపయోగించరు. దానిని కంపల్సరీ వండలి, లేదంటే ఉడికించాలని కోరుతున్నారు. అలా చేస్తేనే టేస్ట్ వస్తుందని అంటున్నారు.