ఎన్నికల వేళ మరో సారి రాహుల్ పెళ్లి గోల.. సప్నా చౌదరిని పెళ్లి చేసుకోవాలంటున్న బీజేపీ
చండీగఢ్/హైదరాబాద్ : సప్నా చౌదరి. ఈమె పేరు మోసిన హరియాణా గాయని, మంచి డాన్సర్ కూడా.! 2018లో నెట్లో అత్యధికులు సెర్చ్ చేసిన సెలబ్రిటీల్లో ఆమెకూడా ఒకరని గూగుల్ ప్రకటించింది. గత 36 గంటలుగా హిందీ బెల్ట్‌లో, ఢిల్లీలో, సామాజిక మాధ్యమాల్లో ఆమె పేరు మార్మోగుతోంది.. ఎందుకు? ''సప్నా చౌదరి కాంగ్రె్‌సలో చేరింది. వెల్‌కమ్ టూ కాంగ్రెస్ ఫ్యామిలీ'' అని యూపీసీసీ చీఫ్ రాజ్‌బబ్బర్ శనివారం ఉదయం ట్వీట్ చేశారు.
ప్రియాంక గాంధీతో కలిసి ఉన్న ఆమె ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. మధుర నియోజకవర్గంలో బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్, సిటింగ్ ఎంపీ హేమమాలినిపై సప్నా చౌదరిని నిలబెట్టాలన్నది కాంగ్రెస్ వ్యూహమని ప్రచారం జరిగింది. కానీ ఆకస్మికంగా ఆమె ఓ ప్రకటన చేస్తూ తాను కాంగ్రెస్‌లో చేరలేదనీ, అసలు ఏ పార్టీ తరఫునా పోటీ కూడా చేయట్లేదని, ప్రియాంకతో ఉన్న ఫోటో కూడా పాతదని పేర్కొనడంతో పరిస్థితి ఇక్క సారిగా మారిపోయింంది.

షాక్ తిన్న కాంగ్రెస్‌వాదులు ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు ఫారం నింపుతున్న ఓ వీడియోను బయటపెట్టడంతో అది వైరల్ అయ్యింది. 'ఆమె స్వయంగా పార్టీ ఆఫీసుకొచ్చి ఫారం నింపి వెళ్లారు. ఆమె సోదరి కూడా కాంగ్రెస్‌లో చేరారు' అని యూపీసీసీ ప్రధాన కార్యదర్శి నరేంద్ర రథి ప్రకటించారు. కానీ సప్న దాన్ని తిరస్కరించారు. 'సప్న సంతకాన్ని కాంగ్రెస్ ఫోర్జరీ చేసింది. ఆ ఫారం 2011-15 మధ్య కాలంది'' అని బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ వ్యాఖ్యానించారు.
యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ మరో అడుగు ముందుకేసి- ''రాహుల్ ఆమెను పెళ్లి చేసుకుంటే బావుంటుంది. ఎందుకంటే ఇటలీలో రాహుల్ తల్లి సోనియా ఏం వృత్తి చేసేవారో- సప్నా చౌదరి కూడ ఇప్పుడదే పనిచేస్తోంది. మీ నాన్న (రాజీవ్) సోనియాను పెళ్లి చేసుకున్నట్లే మీరు ఆమెను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది'' అని వ్యాఖ్యానించడంతో తీవ్ర దుమారం రేగింది. బీజేపీ నేతలు ఎంతకైనా దిగజారి మాట్లాడతారని యూపీ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. మొత్తానికి సప్నా చౌదరి రెండు ప్రధాన పార్టీల గొడవలో ఇరుక్కున్నట్టు పెద్ద యెత్తున ప్రచారం జరుగుతోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications