Leader; అధికార పార్టీ లీడర్ గర్ల్ ఫ్రెండ్ హంగామా, నడిరోడ్డులో హైడ్రామా, బస్సు కిందపడి ?, భార్య టార్చర్ తోనే !
బెంగళూరు/ తిరుపతి: బెంగళూరులోని బీజేపీ నాయకుడు అనంతరాజు ఆత్మహత్య కేసులో అరెస్టు అయ్యి జైలు నుంచి బయటకు వచ్చిన అతని ప్రియురాలు చేసిన హంగామాకు పోలీసులతో పాటు స్థానికులు బిత్తరపోయారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన ఆ లేడీ బస్సు కిందపడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. సమీపంలోనే ఉన్న బంధువు ఆమెను పక్కకు లాగేయడంతో ఆమె ప్రాణాలతో భయటపడింది. పోలీస్ స్టేషన్ ముందు జరిగిన హైడ్రామాతో స్థానికులు షాక్ అయ్యారు. తాను బీజేపీ నాయకుడు అనంతరాజుతో సహజీవనం చేశానని, తనతో ఆయన సంతోషంగా ఉండేవాడని ఆమె చెప్పింది. బీజేపీ నాయకుడు అనంతరాజు ఆయన భార్య టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. పోలీసులు తనకు అన్యాయం చేస్తున్నారని, నా మాటపట్టించుకోవడం లేదని, బీజేపీ నాయకుడి భార్యకు వత్తాసు పలుకుతున్నారని ఆమె ఆరోపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

బీజేపీ లీడర్ ఆత్మహత్య
ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని బ్యాడరహళ్ళిలో నివాసం ఉంటున్న బీజేపీ నాయకుడు అనంతరాజు (46) మే 12వ తేదీన ఆయన నివాసం ఉంటున్న ఇంటిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన అనంతరాజు ఆత్మహత్య చేసుకోవడంతో సొంతపార్టీ నేతలు షాక్ అయ్యారు. అనంతరాజు పూర్వికులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు అని స్థానికలు అంటున్నారు. అనంతరాజు ఆత్మహత్య కేసు ఇప్పటి వరకు అనేక మలుపులు తిరిగింది.

భార్య vs ప్రియురాలు
బీజేపీ నాయకుడు అనంతరాజుకు ఫేస్ బుక్ లో పరిచయం అయిన బెంగళూరులోని కేఆర్ పురం నివాసి రేఖాతో అక్రమ సంబంధం ఉందని ఆరోపణలు ఉన్నాయి. రేఖా, అనంతరాజు ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీశారని, ఆ వీడియోలు అడ్డంపెట్టుకుని రేఖా, ఆమె భర్త, మరో మహిళ బ్లాక్ మెయిల్ చేశారని, అందుకే అనంతరాజు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన భార్య సుమాతో పాటు అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఒకరి మీద ఒకరు ఆరోపణలు
అనంతరాజు భార్య సుమా, రేఖాలు ఇటీవల మొబైల్ ఫోన్ లో మాట్లాడుకున్న సమయంలో రికార్డు అయిన ఆడియో క్లిప్పింగ్ బయటకు రావడం కలకలం రేపింది. నీ భర్త అనంతరాజు అమాయకుడని, తప్పు అంతా నాదే అని, నువ్వు అంటే ఆయనకు ప్రాణం అని రేఖా సుమాకు చెప్పినట్లు ఆడియో క్లిప్పింగ్ లో ఉందని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు. నా భర్త అనంతరాజుకు ఇంట్లోనే నరకం చూపించి అతను ఆత్మహత్య చేసుకునేలా చేస్తానని, నిన్నుకూడా సామన్యంగా వదిలిపెట్టనని, నీ అంతు చూస్తానని సుమా రేఖాకు వార్నింగ్ ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి.

జైలుకు వెళ్లిన ప్రియురాలు
బెంగళూరులోని బీజేపీ నాయకుడు అనంతరాజు ఆత్మహత్య కేసులో ఆయన ప్రియురాలు, కేఆర్ పురం నివాసి రేఖాను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలుకు వెళ్లిన రేఖా బెయిల్ మీద బయటకు వచ్చింది. నేను అనంతరాజు కొన్ని సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నామని రేఖా సంచలన వ్యాఖలు చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన రేఖా ఇప్పుడు ప్రియుడి భార్య సుమా మీద ఆరోపణలు చేస్తోంది.
ఆత్మహత్యాయత్నం చేసిన రేఖా
బీజేపీ నాయకుడు అనంతరాజు ఆత్మహత్య కేసులో అరెస్టు అయ్యి జైలు నుంచి బయటకు వచ్చిన అతని ప్రియురాలు చేసిన హంగామాకు పోలీసులతో పాటు స్థానికులు బిత్తరపోయారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన ఆ లేడీ బస్సు కిందపడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.

నాటకాలు ఆడిందా ?, లేక నిజంగానే
సమీపంలోనే ఉన్న బంధువు ఆమెను పక్కకు లాగేయడంతో ఆమె ప్రాణాలతో భయటపడింది. పోలీస్ స్టేషన్ ముందు జరిగిన హైడ్రామాతో స్థానికులు షాక్ అయ్యారు. పోలీసులు తనకు అన్యాయం చేస్తున్నారని, నా మాటపట్టించుకోవడం లేదని, బీజేపీ నాయకుడి భార్యకు వత్తాసు పలుకుతున్నారని ఆమె ఆరోపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications