బీజేపీ నేత వల్ల నాకూ, అమ్మకూ ప్రాణగండం.. నటి కన్నీటిపర్యంతం (వీడియో)

Kristina Patel: రాజ్‌కోట్‌కు చెందిన మోడల్, నటి క్రిస్టినా పటేల్ బీజేపీ నాయకుడితో పాటు పోలీసులపై సంచలన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. కన్నీళ్లు పెట్టుకుంటూ తన తల్లికి జరిగిన ఘటన గురించి ఆమె వెల్లడించారు. తనకూ, తన తల్లికి సహాయం చేయాలంటూ ప్రజలను వేడుకున్నారు.

అసలు విషయం ఏమిటంటే?
ముంబైలో నివసిస్తున్న క్రిస్టినా పటేల్ తన వీడియోలో తన తండ్రి మరణం తర్వాత అనేక సమస్యలతో పోరాడుతున్నామని చెప్పారు. తన తండ్రి బంధువులు ఆస్తి మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారని, అయితే దీనిపై ఎటువంటి గొడవలు పడకుండా చట్టపరంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించానని వెల్లడించారు. క్రిస్టినా మాట్లాడుతూ.. తాను ముంబైలో నివసిస్తున్నానని, తన తల్లి రాజ్‌కోట్‌లో ఒంటరిగా ఉంటోందని చెప్పారు. తన పెదనాన్న బిపిన్ అమృతీయా, సోదరుడు ఆనంద్ అమృతీయా, పేరు తెలియని మరో వ్యక్తి తన తల్లిపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, తన ఫిర్యాదును కూడా నమోదు చేసుకోలేదని ఆమె తెలిపారు.

BJP Leader Threatened Us Actress Kristina Patel Cries for Help Alleges Life Threat to Her and Mother

పోలీసుల తీరుపై క్రిస్టినా ప్రశ్నలు

క్రిస్టినా తన వీడియోలో పోలీసు కమిషనర్‌ను కూడా సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. నటి మాట్లాడుతూ, "నా పెద్దనాన్న బీజేపీలో ఏదో పదవిలో ఉన్నారు. రాజకీయాల్లో ఉండటం అంటే ఎవరినైనా హత్య చేయవచ్చని దీని అర్థమా? నా తల్లికి ఏదైనా జరిగితే నేను ఏం చేయాలి? ఎవరి ప్రాణానికైనా ముప్పు ఉన్నప్పుడు పోలీసులు ఫిర్యాదు ఎందుకు తీసుకోరు? అది కేవలం బీజేపీలో ఉన్నందుకా? రాజకీయాల్లో ఉన్నారంటే ఎవరి ప్రాణాలైనా తీసేస్తారా? నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను ముంబైలో ఉన్నాను, నా తల్లి రాజ్‌కోట్‌లో ఒంటరిగా ఉన్నారు. నేను గుజరాత్ పోలీసులను తక్షణమే చర్యలు తీసుకోవాలని, నా తల్లికి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాను" అని అన్నారు.

బీజేపీ నేతపై క్రిస్టినా పటేల్ ప్రత్యక్ష ఆరోపణలు
మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం.. క్రిస్టినా పటేల్ పెదనాన్న దినేష్ అమృతీయా బీజేపీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దినేష్ అమృతీయా బీజేపీతో సంబంధాలు కలిగి ఉన్నందున పోలీసులు ఫిర్యాదును నమోదు చేసుకోవడం లేదని, ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని క్రిస్టినా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు నటి భయంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియో చేసి తన ఆవేదనను తెలియజేశారు. ఆ ఘటన జరిగిన రోజు తన తల్లి ఇంట్లోకి కొందరు వ్యక్తులు బలవంతంగా ప్రవేశిస్తున్న దృశ్యాలను చూపిస్తూ ఆ ఫుటేజీని కూడా ఆమె చూపించారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు, తదుపరి చర్యలు ఎలా ఉంటాయో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+