BJP New President : మరో నాలుగు రోజుల్లో బీజేపీకి కొత్త బాస్? జనవరి 20న ఎలక్షన్

దేశ రాజకీయాల్లో కీలక మలుపుకు బీజేపీ సిద్ధమవుతోంది. జనవరి 20న పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఎంపిక చుట్టూ గట్టిగానే రాజకీయ సస్పెన్స్ నెలకొంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా... పార్టీ వర్గాల్లో ఒకే పేరు గట్టిగా వినిపిస్తోంది- నితిన్ నబిన్.

బీజేపీ హైకమాండ్‌లో ఈసారి ఎలాంటి హడావుడి లేదు. సమావేశాలు, చర్చలు, వడపోతలు అన్నీ నిశ్శబ్దంగానే జరిగిపోయినట్లు సమాచారం. ఈ మేరకు శుక్రవారం బీజేపీ పార్టీ రిటర్నింగ్‌ అధికారి కె.లక్ష్మణ్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ. అదేరోజు సాయంత్రం 5-6 గంటల మధ్య నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఇదంతా బీజేపీ హెడ్ ఆఫీస్ లోనే జరగుతుంది.

BJP Leadership Shake-Up Nitin Nabin Set to Become Party Chief Unopposed on January 20

అంతర్గత వర్గాల కథనం ప్రకారం... అధ్యక్ష పదవికి ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే, పోటీ లేకుండానే నితిన్ నబిన్ పార్టీ పగ్గాలు చేపట్టడం ఖాయమనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ పరిణామం వెనుక పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీని తిరిగి పటిష్టం చేయడం, సంస్థాగతంగా మరింత బలంగా తీర్చిదిద్దడం కోసం ఈ ఎంపిక జరిగిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

యువత, కేడర్, రాష్ట్ర నాయకత్వాల మధ్య సమతుల్యం పాటించే నేతగా నితిన్ నబిన్‌కు హైకమాండ్ పూర్తి నమ్మకం ఉందట. అయితే, పార్టీ లోపల మరో కథ కూడా నడుస్తోంది. కొందరు సీనియర్ నేతలు చివరి నిమిషంలో ట్విస్ట్ ఉంటుందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో చివరి క్షణం వరకూ ఏదైనా జరగొచ్చన్న నానుడి గుర్తు చేస్తూ... జనవరి 20 వరకు ఉత్కంఠ తప్పదంటున్నారు.

మరోవైపు, కొత్త అధ్యక్షుడి ఎంపికతో బీజేపీ భవిష్యత్ దిశ ఏంటి? వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పార్టీ ఎలా సిద్ధమవుతుంది? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఒక్క నిర్ణయంతో పార్టీ వ్యూహం మారబోతుందా? లేక ఇప్పటికే ఖరారైన రోడ్‌మ్యాప్ అమల్లోకి రానుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మొత్తానికి... బీజేపీలో కొత్త బాస్ ఎన్నిక పైకి ప్రశాంతత కనిపిస్తున్నా, లోపల మాత్రం రాజకీయ వేడి తారస్థాయిలో ఉంది. జనవరి 20న తెరలేచే ఈ కథలో అసలు హీరో ఎవరో తేలాల్సి ఉంది!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+