సోమరి తల్లుల వల్లే మ్యాగీ అమ్మకాలు పెరిగాయి: ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ఇండోర్: ఈతరం తల్లులు సోమరులుగా మారడం వల్లనే దేశంలో మ్యాగీ అమ్మకాలు పెరిగాయని భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘తల్లులు అంత సోమరులుగా ఎందుకు మారారో తెలియదు. వారు తమ పిల్లలకు రెండు నిమిషాల్లో తయారయ్యే ఆహారాన్ని తినిపిస్తున్నారు. మా తరానికి చెందిన తల్లులు ఇంట్లో తయారు చేసిన పరాఠా, హల్వా, సేమియా తినిపించేవారు' అని మధ్యప్రదేశ్ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉషా ఠాకూర్ పేర్కొన్నారు.
భారతీయ తల్లుల గురించి బిజెపి మహిళా ఎమ్మెల్యే అలా మాట్లాడటాన్ని కాంగ్రెస్ ఖండించింది. ఆమె తల్లులందరినీ అవమానించారని మధ్యప్రదేశ్ మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు అర్చనా జైశ్వాల్ అన్నారు. అయితే.. మ్యాగీపై నిషేధానికి బిజెపి ఎమ్మెల్యేతో పాటు, వర్తక సంఘాలూ మద్దతు పలికాయి.

ఆలిండియా వర్తక సమాఖ్య (సీఏఐటీ) అయితే.. మ్యాగీలో లేని దాన్ని ఉన్నట్లుగా, ఉన్నదాన్ని లేనట్లుగా ఎలా ప్రచారం చేస్తారని కేంద్రాన్ని ఒక ప్రకటనలో ప్రశ్నించింది. మ్యాగీ ప్యాక్‌పై ‘గ్రైన్ శక్తి' అని ఉంటుందని.. అది ఏ ధాన్యమో, ఎంత శక్తి ఉంటుందో, శక్తి అంటే ఆ సందర్భంలో ఏమిటో వివరాలేమీ ఉండవని భాటియా తన లేఖలో వివరించారు.
అయితే.. అవి ఏ పిండితో తయారైన రోటీలో, ఒక రోటీలో ఎంత ఫైబర్ ఉంటుందో వివరాలేవీ కొనుగోలుదారుకు తెలియవని ఆయన వాపోయారు. సదరు ఆహారం తింటే ఆరోగ్యమని, ఎలాంటి శాస్త్రీయ సమాచారం లేకుండా వినియోగదారులకు హామీ ఇచ్చే వారిది బాధ్యతారాహిత్యమేనని భాటియా వివరించారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications