బీజేపీ ఎంపీ సన్వర్ లాల్ జాట్ కన్నుమూత

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: అజ్మీర్ బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సన్వర్ లాల్ జాట్ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. జులై నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన స్పృహ తప్పిపడిపోయారు.

వెంటనే ఆయనను జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్(ఎస్ఎంఎస్) ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. సన్వర్ లాల్‌కు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు.

BJP MP Sanwar Lal Jat no more

సన్వర్ లాల్ 1955, జనవరి 1న అజ్మీర్‌లో జన్మించారు. ఎం.కామ్, పీహెచ్‌డీ చేసి ప్రొఫెసర్‌గా కూడా ఆయన పనిచేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారు. రాజస్థాన్ రాష్ట్ర మంత్రి కూడా ఆయన పనిచేశారు. ప్రధాని మోడీ మంత్రివర్గంలో 2014-16 వరకు జలవనరుల సహాయ మంత్రిగా ఆయన పనిచేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sanwar Lal Jat, a Bharatiya Janata Party (BJP) MP and former Union Minister Sanwar Lal Jat, who was being treated at AIIMS in New Delhi, has passed away earlier this morning.
Please Wait while comments are loading...