వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరుమాసాల ముందే ఎన్నికలకు, నితీష్ హర్థిక్ ప్లాన్ కు చెక్ పెట్టేందుకు, గుజరాత్ లో ఓబిసి సిఎం అభ్యర్థే

ఆరు మాసాల ముందే ఎన్నికలు వెళ్తే ఎలా ఉంటుందనే యోచనలో బిజెపి అధినాయకత్వం ఉంది. ముందుగానే ఎన్నికలకు వెళ్ళడం ద్వారా గుజరాత్ రాష్ట్రంలో రాజకీయంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నాయకత్వం అంచనా వేస

By Narsimha
|
Google Oneindia TeluguNews

గుజరాత్ :ఆరు మాసాల ముందే ఎన్నికలు వెళ్తే ఎలా ఉంటుందనే యోచనలో బిజెపి అధినాయకత్వం ఉంది. ముందుగానే ఎన్నికలకు వెళ్ళడం ద్వారా గుజరాత్ రాష్ట్రంలో రాజకీయంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. ఇదే అభిప్రాయంతో ఆర్ ఎస్ ఎస్ నాయకులు కూడ ఏకీభవిస్తున్నారు. అయితే గుజరాత్ లో ఆరుమాసాల ముందుగానే ఎన్నికలకు వెళ్ళే విషయమై ఇంకా నిర్ణయానికి రాలేదు.

గుజరాత్ రాష్ట్రంలో బిజెపి ఇటీవల కాలంలో రాజకీయంగా ఇబ్బంది కర పరిస్థితులను ఎదుర్కొంది. నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా బాద్యతలు స్వీకరించిన తర్వాత ఆయన స్థానంలో భాద్యతలను స్వీకరించిన ఆనందీబెన్ పూర్తి కాలంపాటు ముఖ్యమంత్రి బాద్యతలను నిర్వహించలేకపోయారు.

ఆనందీబెన్ స్థానంలో విజయ్ రూపానీ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే హర్థిక్ పటేల్ గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించిన ఉద్యమం రాజకీయంగా బిజెపికి కొంత ఇబ్బందిని కల్గించింది. ఈ పరిస్థితులనుండి బయటపడేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఆరు మాసాల ముందే ఎన్నికలకు వెళ్తే ప్రయోజనం కలిగే అవకాశం ఉందని భావిస్తోంది.

వాస్తవానికి వచ్చే ఏడాది డిసెంబర్ మాసంలో గుజరాత్ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికలు జరగాలి..అయితే ముందుగానే ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రత్యర్థులకు చెక్ పెట్టవచ్చని బిజెపి నాయకత్వం భావిస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఆరుమాసాల ముందే ఎన్నికలు

ఆరుమాసాల ముందే ఎన్నికలు


నిర్ణీత షెడ్యూల్ కంటే ఆరుమాసాల ముందే ఎన్నికలును గుజరాత్ లో నిర్వహించడం ద్వారా ప్రత్యర్థులకు రాజకీయంగా ప్రయోజనాలు దక్కకుండా చేయవచ్చనే అభిప్రాయంతో బిజెపి అధిష్టానం ఆలోచనలో ఉంది. వచ్చే ఏడాది డిసెంబర్ లో నిజానికి ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ముందుగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆ పార్టీ అభిప్రాయంతో ఉంది. పార్టీలోని ఓ వర్గం ముఖ్యమంత్రి మార్పును కోరుకొంటోంది. ఎన్నికలకు వెళ్ళడం ద్వారా ఇబ్బందికర పరిస్థితులను పార్టీలో చక్కదిద్దుకొనే అవకాశం ఉంటుందని పార్టీ సీనియర్లు అభిప్రాయంతో ఉన్నారు.

ఓబిసి అభ్యర్థిని రంగంలోకి దించాలని ప్లాన్

ఓబిసి అభ్యర్థిని రంగంలోకి దించాలని ప్లాన్

గుజరాత్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఓబిసి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ వ్యూహం వల్ల రాజకీయంగా ప్రయోజనం కలుగుతోందని ఆ పార్టీ అంచనావేస్తోంది. ఓబిసి అభ్యర్థిని సిఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్, ఆప్ పార్టీలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుందని బిజెపి అంచనా వేస్తోంది.గుజరాత్ లో ఓబిసి ల సంఖ్య సుమారు 45 శాతం ఉంటుంది. ఈ సామాజిక వర్గాలను ప్రభావితం చేసే నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఫలితాలు తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని బిజెపి అభిప్రాయంతో ఉంది.

ఆర్ఎస్ ఎస్ కూడ ఓకే

ఆర్ఎస్ ఎస్ కూడ ఓకే


గుజరాత్ రాష్ట్రంలో ఆరుమాసాల ముందే ఎన్నికల నిర్వహణకు ఆర్ ఎస్ ఎస్ కూడ సానుకూలంగా ఉంది.ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడ నాలుగు రోజులుగా గుజరాత్ లోనే మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నాడు. గుజరాత్ రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉన్నట్టు చెబుతున్నారు భిజెపి ఆర్ ఎస్ ఎస్ నాయకులు.

బిజెపి చెబుతున్న కారణాలు

బిజెపి చెబుతున్న కారణాలు

గుజరాత్ రాష్ట్రంలో పటేల్ వర్గం అంతగా బలం లేకున్నా రాజకీయంగా వారు ప్రభావితం చేయగలరు.182 అసెంబ్లీ సీట్లో 38 పటీదార్లు ఎంఏల్ఏలుగా ఎన్నికయ్యారు. పటేల్ సామాజికవర్గానికి చెందిన వారు సుమారు 80 అసెంబ్లీ స్థానాల్లో గెలుపుఓటములను ప్రభావితం చేయగలరు. గుజరాత్ రాష్ట్రంలో హర్థిక పటేల్ నిర్వహించిన ఆందోళన ఆ రాష్ట్రంలో బిజెపి కి కొంత ఇబ్బందికర వాతావరణాన్ని తెచ్చింది. అయితే కోర్టు తీర్పుల కారణంగా హర్థిక్ పటేల్ ప్రస్తుతం గుజరాత్ కు వచ్చే పరిస్థితులు మాత్రం లేకపోవడంతో ఇబ్బందులు తాత్కాలికంగా తప్పాయి.

నితీష్ ,హార్థిక్ పటేల్ కలిశారు

నితీష్ ,హార్థిక్ పటేల్ కలిశారు


గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తోన్నందున హర్థిక్ పటేల్ బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కలిశారు. వచ్చే ఏడాది జనవరిలో నితీష్ కుమార్ గుజరాత్ రాష్ట్రంలో పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నారు. హర్థిక్ పటేల్ తో కలిసి గుజరాత్ రాష్ట్రంలో నితీష్ తన గేమ్ ప్లాన్ అమలు చేస్తే రాజకీయంగా కొంత నష్టపోయే అవకాశం ఉంటుందని బిజెపి నాయకత్వం అభిప్రాయపడుతోంది.నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తే నితీష్ కు ఏడాది సమయాన్ని కేటాయించినవారు అవుతారు. దాని వల్ల తమకు రాజకీయంగా ఇబ్బందికలిగే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయంతో ఉన్నారు.ఆప్ కూడ గుజరాత్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది.ఈ రెండు పార్టీలకు ప్రయోజనం కల్గించకుండా ఉండాలంటే ముందస్తు ఎన్నికలే మార్గమని ఆ పార్టీ భావిస్తోంది.

 వర్షాలు కురవకపోతే

వర్షాలు కురవకపోతే


2016 ...17 సంవత్సరంలో రాష్ట్రంలో వర్షాలు బాగానే కురిశాయి.అయితే వచ్చే ఏడాది ఎన్నికల సంవత్సరం వర్షాకాలం పూర్తైన తర్వాత నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తే ఒకవేళ సక్రమంగా వర్షాలు కురవకపోతే ఆ ప్రభావం ఎన్నికల్లో తమపై పడే అవకాశం ఉందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఈ ప్రభావం వల్ల గ్రామీణ ప్రాంతంలోని గుజరాత్ ఓటర్లు బిజెపికి వ్యతిరేకంగా ఓటు చేసే అవకాశం ఉంది.

English summary
the bjp is keen to advance assembly elections in gujarat, as per schedule elections are supposed to be held in december 2017, but the bjp rss is contemplating to prephone it by at least sixmonths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X