మహారాష్ట్ర కథ క్లోజ్, కర్ణాటక మీద అమిత్ షా కన్ను, సీఎంకు ఫోన్, అక్కడ ఏం జరుగుతోంది !
న్యూఢిల్లీ/బెంగళూరు: మహారాష్ట్ర కథ క్లోజ్ కావడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కన్ను కర్ణాటక మీద పడింది. కర్ణాటకలో 15 శాసన సభ నియోజక వర్గాల్లో మీరు ఏం చేస్తున్నారు ? అక్కడ పరిస్థితి ఎలా ఉంది ? మనకు అనుకూలంగా ఉందా ? లేదా ? అనే క్లారిటీ ఇవ్వాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు ఫోన్ చేసి వివరాలు అడిగారని తెలిసింది. అక్కడి ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మీ మీద ఉందనే విషయం గుర్తు పెట్టుకోండి అంటూ సీఎం యడియూరప్పకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనేక సూచనలు సలహాలు ఇచ్చారని సమాచారం.

మీ టార్గెట్ గుర్తు పెట్టుకోండి !
కర్ణాటకలోని 15 శాసన సభ నియోజక వర్గాల్లో డిసెంబర్ 5వ తేదీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 15 నియోజక వర్గాల్లో కచ్చితంగా 12 నియోజక వర్గాల్లో విజయం సాధించాలని, ఆ విదంగా మీరు పక్కాప్లాన్ తయారు చేసుకోవాలని సీఎం యడియూరప్పకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచించారని సమాచారం.

మంత్రులు, ఎమ్మెల్యేలు
ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించే బాధ్యతలు మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలకు అప్పగించాలని, ఎప్పటికప్పుడు మీరు సమాచారం సేకరించాలని కర్ణాటక సీఎం యడియూరప్పకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచించారని తెలిసింది.

మాకు చెప్పండి, మేం చూసుకుంటాం
ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల కోసం నని చెయ్యకుండా నిర్లక్షం చేసే మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానికుల నాయకుల గురించి మాకు సమాచారం ఇవ్వాలని, తరువాత వాళ్ల కథ మేము చూసుకుంటామని అమిత్ షా గట్టిగానే సీఎం యడియూరప్పకు చెప్పారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

మన ప్రభుత్వం ఉండాలి
కర్ణాటకలో ఎంతో కష్టపడి మనం అధికారంలోకి వచ్చాం, ఉప ఎన్నికలు మనకు పరువు ప్రతిష్టతో సమానం. కచ్చితంగా ఉప ఎన్నికల్లో మన సత్తా చాటుకుంటే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే ప్రతిపక్షాలకు మనం చాన్స్ ఇచ్చినట్లు అవుతోందని అమిత్ షా గుర్తు చేశారని తెలిసింది. ఉప ఎన్నికల్లో మీరు చెప్పిన వాళ్లకే టిక్కెట్లు ఇచ్చామని, వారిని గెలిపించుకునే బాధ్యత మీదే అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సీఎం యడియూరప్పకు చెప్పారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications