షాక్: యడియూరప్ప భజన చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, దిమ్మ తిరిగింది, ఆయనే సీఎం, స్పీకర్!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప నేడు (సోమవారం) బలపరీక్ష నిరూంపించుకుంటున్నారని, ఆయన కచ్చితంగా విజయం సాదిస్తారని, అందులో ఎలాంటి డౌట్ లేదని చిక్కమగళూరు జిల్లాలోని శృంగేరి శాసన సభ్యుడు టీడీ, రాజేగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎంకు ఎమ్మెల్యేల మద్దతు
కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడియూరప్ప కొనసాగుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టీడీ. రాజేగౌడ జోస్యం చెప్పారు. బీఎస్. యడియూరప్ప అనుకున్నదాని కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు సంపాదించుకుంటున్నారని ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టీడీ. రాజేగౌడ అన్నారు.

యడియూరప్ప భజన
కాంగ్రెస్ ఎమ్మెల్యే టీడీ. రాజేగౌడ మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప భజన చెయ్యడంతో ఆ పార్టీ నాయకులు షాక్ కు గురైనారు. ఇదే సమయంలో మాట్లాడిన ఎమ్మెల్యే టీడీ. రాజేగౌడ స్పీకర్ కేఆర్. రమేష్ కుమార్ సరైన సమయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

స్పీకర్ గ్రేట్
ప్రజాప్రభుత్వాన్ని కాపాడటానికి స్పీకర్ రమేష్ కుమార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని, ఆయన నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టీడీ. రాజేగౌడ అన్నారు. స్పీకర్ కేఆర్. రమేష్ కుమార్ కు ఎంతో రాజకీయ అనుభవం ఉందని, ఆయన అన్నీ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టీడీ. రాజేగౌడ చెప్పారు.

రెబల్ ఎమ్మెల్యేలకు శిక్ష
ఒక పార్టీ చిహ్నం మీద ఎమ్మెల్యేలు అయిన వారు చివరి వరకు అదే పార్టీలో ఉండాలని, అలా కాకుండా రాజీనామాలు చేసి వేరే పార్టీలో చేరాలనుకుంటే ఇలాంటి శిక్షే పడుతుందని టీడీ. రాజేగౌడ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే టీడీ. రాజేగౌడ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చెయ్యడంతో అసెంబ్లీలో ఆయన ఎవరికి మద్దతుగా ఓటు వేస్తారు అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

కాంగ్రెస్ దిమ్మతిరిగింది
కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన తరువాత అధికారంలోకి రావడానికి సిద్దం అయ్యింది. బీజేపీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీడీ. రాజేగౌడ సంచలన వ్యాఖ్యలు చెయ్యడంతో ఆ పార్టీ నాయకుల దిమ్మతిరిగింది.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీడీ. రాజేగౌడ వ్యాఖ్యలతో షాక్ కు గురైన ఆ పార్టీ నాయకులు మౌనంగా ఉన్నారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications