BJP మిషన్ 2029- డీలిమిటేషన్ ఆలస్యం వెనుక, అసలు లెక్కలు.. కొత్త మిత్రులు..!!

జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు. బీజేపీ నాయకత్వం రూటు మార్చింది. ఢిల్లీలో జెన్ జీ ఉద్యమం తరువాత పంథాలో మార్పు చేసుకుంది. దూకుడు కంటే అందరినీ కలుపుకొని వెళ్లే ప్రణాళికలను అమలు చేస్తోంది. అందులో భాగంగా డీలిమిటేషన్ వ్యవహారంలో కొత్త వ్యూహాన్ని సిద్దం చేసింది. ఎన్డీఏలోకి నయా మిత్రులు చేరేందుకు రంగం సిద్దం అయింది. మోదీ 4.0 టార్గెట్ గా పావులు కదుపుతోంది. అందులో తెర వెనుక రాజకీయమే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారుతోంది.

బీజేపీ నాయకత్వం వ్యూహాలు విపక్షాలకు అంతు చిక్కటం లేదు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాయిదా పడి 40 రోజులు పూర్తయింది. ఇప్పటి వరకు ప్రోరోగ్ చేయలేదు. మహిళా రిజర్వేషన్- డీలిమిటేషన్ బిల్లును మరోసారి ప్రవేశ పెట్టేందుకే సమావేశాలను ప్రోరోగ్ చేయలేదు అంటూ విశ్లేషణలు వస్తున్నాయి. అటు కాంగ్రెస్ సైతం ఇదే అంశాన్ని ప్రశ్నిస్తోంది. మహిళా రిజర్వే షన్లకు తాము మద్దతు ఇస్తామని చెబుతూనే.. డీలిమిటేషన్ కు మాత్రం మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెబుతోంది. 25 ఏళ్ల పాటు మార్పులు చేయవద్దని ప్రధానికి లేఖ రాసింది. అయితే, కాలం గడుస్తున్న కొద్దీ డీలిమిటేషన్ వ్యవహారంలో కాంగ్రెస్ కూటమిలో స్వరం మారుతోంది. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న ప్రధాన పార్టీలు తమ వాదనల్లో మినహాయింపులు ఇస్తున్నాయి.

ఏపీ, తెలంగాణ బీజేపీ కొత్త ఇంఛార్జ్ లు- పురందేశ్వరి, డీకే అరుణకు కీలక పదవులు..!!
ఏపీ, తెలంగాణ బీజేపీ కొత్త ఇంఛార్జ్ లు- పురందేశ్వరి, డీకే అరుణకు కీలక పదవులు..!!
BJP Treads Cautious Path on Delimitation Bill Weighs Regional Party Concerns Complete Report Here

అంతు చిక్కని వ్యూహం

అయితే, బీజేపీ నాయకత్వం లెక్కలు మాత్రం వేరుగా ఉన్నాయి. ఢిల్లీలో జెన్ జీ ఉద్యమం తరువాత ఎన్డీఏ మిత్రపక్షాలు సైతం ఉలిక్కి పడ్డాయి. తిరుగులేని నేతగా ప్రచారంలో ఉన్న మోదీ వీరి దెబ్బకు ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించటంతో ఒక్క సారిగా మోదీ నాయకత్వం పైన చర్చ మొదలైంది. ఎన్డీఏ మిత్రపక్షాలతో పాటుగా ఇతర పార్టీల్లో కనిపిస్తున్న మార్పు పైన బీజేపీ నాయకత్వం ఫోకస్ చేసింది. త్వరలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందు లో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. పంజాబ్, ఉత్తరాఖండ్ ఆ తరువాత గుజరాత్ ఎన్నికల్లోనూ బీజేపీ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక.. బీజేపీ అసలు లక్ష్యం మోదీ 4.0 గా మారింది.

కొత్త మిత్రుల కోసం

బీజేపీ నాయకత్వం ప్రస్తుతం ఎన్డీఏ లో ఉన్న వారితో పాటుగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ తో కలవని మిత్రపక్షాలతో కొత్తగా మైత్రి కోరుకుంటోంది. 2029 ఎన్నికల్లో వరుసగా నాలుగో సారి గెలవటం అంత సులభం కాదనే అభిప్రాయం ఉంది. దీంతో.. తాము అధికారంలోకి రావాలంటే ముందుగా ప్రత్యర్థిని బలహీన పర్చాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా కాంగ్రెస్ తో ఉన్న పార్టీలతో పాటుగా తటస్థంగా ఉన్న వారికి గాలం వేస్తోంది. కీలకమైన డీలిమిటేషన్ విషయంలో ఆ పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంటోంది. వారి సూచనలకు గౌరవం ఇస్తూ డీలిమిటేషన్ బిల్లును ఆమోదం పొందేలా వ్యూహాలు సిద్దం చేస్తోంది. దీని ద్వారా బిల్లు ఆమోదంతో పాటుగా భవిష్యత్ లో ఆ పార్టీల మద్దతు పొందేలా ద్విముఖ వ్యూహాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది. అందులో భాగంగానే కాంగ్రెస్ కు ప్రధాన మద్దతు దారులుగా ఉన్న ఎన్సీపీ (శరద్ పవార్), డీఎంకే పైన బీజేపీ గురి పెట్టింది. ఈ రెండు పార్టీల సూచనలకు ప్రాధాన్యత ఇస్తోంది.

 డీలిమిటేషన్ పై కేంద్రం బిగ్ డెసిషన్ - ఊహించని సమీకరణం, కీలక మలుపు..!!
డీలిమిటేషన్ పై కేంద్రం బిగ్ డెసిషన్ - ఊహించని సమీకరణం, కీలక మలుపు..!!
BJP Treads Cautious Path on Delimitation Bill Weighs Regional Party Concerns Complete Report Here

డీఎంకే సూచనలతో

తమిళనాడులో మారిన రాజకీయ సమీకరణాలతో ఇప్పటికే డీఎంకే అటు కాంగ్రెస్ కు దూరంగా జరిగింది. ఇక.. డీలిమిటేషన్ బిల్లు కు మద్దతు కావాలంటే దక్షిణాది రాష్ట్రాల సీట్ల వాటా ఏమాత్రం తగ్గకుండా పాత నిష్పత్తినే కొనసాగించాలనే ప్రతిపాదనపై కట్టుబడి ఉండాలని సూచిస్తోంది.బిల్లును ఆమోదించే ముందే ప్రతి రాష్ట్రానికి కేటాయించబోయే సీట్ల సంఖ్యతో కూడిన స్పష్టమైన షెడ్యూల్‌ను బిల్లులో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తోంది. దీంతో, కేంద్రం సైతం ఆ దిశగా తుది కసరత్తు చేస్తోంది. అయినప్పటికీ డీఎంకే ఈ బిల్లులో మద్దతు విషయంలో కొంత డైలమాలో ఉందనే విషయం స్పష్టం అవుతోంది. ఇక.. టీఎంసీ, ఎన్సీపీ, శివసేన చీలక ఎంపీల మద్దతుతో ఈ బిల్లును పాస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కాగా, ఈ డీలిమిటేషన్ బిల్లు నెగ్గించుకోవాలంటే కేంద్రానికి మూడింట రెండు వంతుల మెజారిటీకి 360 ఓట్లు కావాల్సి ఉంటుంది.

కొత్త మిత్రుల మద్దతుతో

డీఎంకేకు చెందిన 22 మంది సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే, ప్రభుత్వ బలం 346కు చేరుతుంది. అయినా ఇంకా కేంద్రానికి 14 మంది ఎంపీల మద్దతు అవసరం. ఈ సంఖ్య సమస్య కాదని బీజేపీ భావిస్తోంది. అదే విధంగా రాజ్యసభలో మాత్రం కేంద్రానికి మూడింట రెండు వంతుల మెజారిటీ లభించే అవకాశం ఉంది. రాజ్యసభలో ఓటింగ్ సమయంలో మొత్తం 244 మంది సభ్యులు హాజరైతే, ప్రభుత్వానికి 164 ఓట్లు కావాలి. ప్రస్తుతం ఎన్డీయేకు 158 మంది ఎంపీల బలం ఉంది. ప్రస్తుతం ఖాళీ కానున్న 12 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో ఉత్తరప్రదేశ్‌లో 10, ఉత్తరాఖండ్, బెంగాల్ లో ఒక్కో స్థానానికి ఎన్నిక జరుగతుంది. వీటిల్లో పది స్థానాలు బీజేపీ గెలిచే అవకాశం ఉంది. ఈ లెక్కలు... టార్గెట్ 2029 లక్ష్యంగా బీజేపీ డీలిమిటేషన్ బిల్లులో అమలు చేస్తున్న కొత్త వ్యూహాలతో నవరాత్రుల వేళ పార్లమెంట్ సమావేశాలకు ప్లాన్ చేస్తోంది. దీంతో.. బీజేపీ వ్యూహాలు ఎంత వరకు ఫలిస్తాయనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+