వైరల్ వీడియో: మహిళ ప్రైవేట్ పార్ట్ ను టచ్ చేసిన డెలివరీ బాయ్..

ఓ మహిళతో డెలివరీ బాయ్ అసభ్యంతరంగా ప్రవర్తించాడు. మహిళతో మాట్లాడుతూ ఆమె ప్రైవేట్ పార్ట్ టచ్ చేశాడు. దీంతో ఆమె వెనక్కు జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మహిళను ఉద్దేశపూర్వకంగానే తాకినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను ఆ మహిళ ఎక్స్ లో పోస్టు చేసింది. అయితే ఈ విషయంపై తొలుత ఆ డెలివరీ సంస్థ స్పందించలేదు. కానీ వీడియో వైరల్ కావడంతో డెలివరీ బాయ్ ను టర్మినేట్ చేసినట్లు సమాచారం.

మహిళలపై అఘాయిత్యాలు, దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవలికాలంలో రద్దీ ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో అమ్మాయిలను అసభ్యంగా తాకుతూ వెళ్తున్న దృశ్యాలు అధికం అయ్యాయి. తాజాగా బ్లింకిట్ సంస్థకు చెందిన డెలివరీ బాయ్ ఆర్డర్ పెట్టిన ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మహిళకు పార్సిల్ ఇస్తూ ప్రైవేట్ పార్ట్ ను డెలివరీ బాయ్ అసభ్యంగా తాకినట్లుగా వీడియోలో ఉంది.

ఈ వీడియోలో బ్లింకిట్ యెల్లో కోడ్ డ్రెస్ ధరించిన ఆ డెలివరీ బాయ్ మహిళకు పార్సిల్ ఇస్తూ పేమెంట్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆమె చెస్ట్ ను చేతితో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళ అతడిపై అసహనం ప్రదర్శించింది. ఇదే విషయాన్ని ఆ మహిళ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. "ఈ రోజు నేను బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టినప్పుడు ఈ ఘటన జరిగింది. డెలివరీ బాయ్ నన్ను అడ్రస్ అడుగుతూ అసభ్యంగా నా ప్రైవేట్ పార్ట్ తాకాడు. ఇలాంటివి అనుమతించొద్దు. బ్లింకిట్ ఈ ఘటనపై స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి.. అని పేర్కొంది. భారత్ లో మహిళలకు రక్షణ అనేది ఓ జోక్ మాత్రమేనా.. అని ప్రశ్నలు లేవనెత్తింది.

Blinkit Delivery Boy s Shocking Harassment Woman Shares Viral CCTV Video of Inappropriate Touch

అయితే ఆమె వ్యాఖ్యలను తొలుత బ్లింకిట్ తోసిపుచ్చింది. ఆ తర్వాత ప్రూఫ్ పెట్టడంతో డెలివరీ బాయ్ ను తొలగించింది. ఆ తర్వాత మహిళ వ్యాఖ్యలకు స్పందిస్తూ పోస్టు పెట్టింది. హాయ్.. మీరు సరైన సమయంలో చెప్పిన విషయాలను మేము గ్రహిస్తున్నాం. ఈ ఘటనపై మేము చింతిస్తున్నాం. ఈ ఘటనపై మేము స్పందించాం. సరైన నిర్ణయం తీసుకున్నాం.. అని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+