వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడులో బ్లా వేల్ ఛాలెంజ్ గేమ్ బ్యాన్: హైకోర్టు అక్షింతలు, లింక్ లు షేర్ చేస్తే జైలుకు !

యువత ప్రాణాలు తీస్తున్న బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ ను తమిళనాడు ప్రభుత్వం బ్యాన్ చేసింది. సూసైడ్ గేమ్ గా మారిన ప్రమాదకరమైన బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ ను ఆన్ లైన్ లో బ్లాక్ చేశామని తమిళనాడు .

|
Google Oneindia TeluguNews

చెన్నై: యువత ప్రాణాలు తీస్తున్న బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ ను తమిళనాడు ప్రభుత్వం బ్యాన్ చేసింది. సూసైడ్ గేమ్ గా మారిన ప్రమాదకరమైన బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ ను ఆన్ లైన్ లో బ్లాక్ చేశామని తమిళనాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ కు తెలియజేశారు.

మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఆదేశాలతో బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ ను బ్లాక్ చేశామని, సోషల్ మీడియాలో వీటి లింక్ లు షేర్ చేసే వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు పోలీసు శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

కాలేజ్ విద్యార్థి

కాలేజ్ విద్యార్థి

ఆగస్టు 30వ తేదీన ప్రైవేట్ కాలేజ్ విద్యార్థి విఘ్నేష్ (19) బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ కు బానిస అయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు. విఘ్నేష్ ఆత్మహత్య విషయంపై మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది.

ప్రభుత్వానికి అక్షింతలు

ప్రభుత్వానికి అక్షింతలు

విఘ్నేష్ ఆత్మహత్యపై దాఖలు అయిన పిటిషన్ ను మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ న్యాయమూర్తి కేకే. శశిధరన్, న్యాయమూర్తి జీఆర్. స్వామినాథన్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ విచారణ చేసింది. బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ ను ఎందుకు బ్యాన్ చెయ్యలేదని తమిళనాడు ప్రభుత్వం, పోలీసు శాఖ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది.

అందరూ

అందరూ

యువత ప్రాణాలు తీస్తున్న బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ ను ఎందుకు బ్యాన్ చెయ్యలేదు, ఆ విషయంలో ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోంది, అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోతున్నారని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ ను బ్యాన్ చెయ్యాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయవాది కోర్టులో మనవి చేశారు.

బ్లూ వేల్ గేమ్ బ్యాన్ చేశాం

బ్లూ వేల్ గేమ్ బ్యాన్ చేశాం

తమిళనాడు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోవిందరాజన్ బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ ను బ్యాన్ చేశామని అన్నారు. బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ లింక్ లు షేర్ చేసే వారి మీద నిఘా వర్గాలు డేగకన్ను వేశారని, అధికారులు సమర్థవంతంగా పని చేస్తున్నారని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోవిందరాజన్ కోర్టులో మనవి చేశారు.

విఘ్నేష్ బ్లూ వేల్ గేమ్ బానిస

విఘ్నేష్ బ్లూ వేల్ గేమ్ బానిస

ఆగస్టు 30వ తేదీ ఆత్మహత్య చేసుకున్న కాలేజ్ విద్యార్థి 100 శాతం బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ కు బానిస అయ్యాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. విఘ్నేష్ స్వయంగా వారి స్నేహితులతో మాట్లాడుతూ బ్లూ వేల్ గేమ్ చాల థ్రిల్లింగ్ గా ఉంటుందని, నేను క్రమం తప్పకుండా ఆడుతానని అనేక సార్లు చెప్పాడని పోలీసుల విచారణలో తెలిసింది.

English summary
Taking a serious view of the Blue Whale Challenge game, the Madras High Court on Monday directed the Central and Tamil Nadu governments to explore possibilities of banning it. Initiating suo motu proceedings in the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X