CCTV: బ్రేక్ అనుకుని యాక్సిలేటర్ తొక్కాడా.. ఏందీ?

Bengaluru bus accident: బెంగళూరులో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఓ సిటీ బస్సు అదుపు తప్పింది. వాహనాదారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. పలు కార్లు, బైకులు ధ్వంసం అయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకాన్ని కలిగించింది.

సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి దృశ్యాలు.. బస్సులో అమర్చిన సీసీటీవీల్లో రికార్డయింది. బెంగళూరు సిటీ ట్రాఫిక్ విభాగం పోలీసులు ఈ వీడియో ఫుటేజీని మీడియాకు విడుదల చేశారు.

BMTC AC Volvo bus lost control and rammed into several vehicles in Bengaluru

బెంగళూరు హెబ్బాళ ఫ్లైఓవర్‌పై ఈ ఘటన సంభవించింది. ఈ ఉదయం కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి మెజిస్టిక్ బస్ స్టేషన్‌కు బయలుదేరిన బీఎంటీసీ ఏసీ బస్సు అది. ఫ్లైఓవర్ మీదికి చేరుకున్న తరువాత అదుపు తప్పింది. ఎదురుగా ఉండే వాహనాలపైకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో మూడు బైకులు, అయిదు కార్లు ధ్వంసం అయ్యాయి. తనకు తానుగా ఆగేంత వరకూ వరకూ ఈ బీఎంటీసీ సిటీ బస్సు వాహనాలపైకి దూసుకెళ్తూనే కనిపించింది. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ డ్రైవర్ క్యాబిన్‌లో అమర్చిన సీసీటీవీల్లో క్లియర్‌గా రికార్డయింది.

ఈ ఘటనలో ఇద్దరు వాహనదారులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేశారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేశారు. విచారణకు ఆదేశించారు. డ్రైవర్‌ను డిపో స్పేర్‌లో పెట్టినట్లు బీఎంటీసీ అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+