మరో విషాదం: నటుడు అనుమానాస్పద మృతి: ఉరి వేసుకున్న స్థితిలో: బిహారీ: హత్యేనంటూ

ముంబై: చిత్ర పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మరో వర్ధమాన నటుడు అనుమానాస్పదంగా మరణించారు. బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ కేసుపై విచారణ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రకంపలను సృష్టిస్తోంది. ఆ నటుడి పేరు- అక్షత్ ఉత్కర్ష్. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తరహాలోనే ఆయన కూడా బిహార్‌కు చెందిన నటుడు. ముంబైలో స్థిరపడ్డారు. ఇదివరకు అక్షత్ ఉత్కర్ష్.. ఒకట్రెండు భోజ్‌పురి సినిమాలతో పాటు కొన్ని టీవీ సీరియళ్లలో నటించారు. బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో ముంబైకి షిఫ్ట్ అయ్యారు.

బిహార్‌లోని ముజప్ఫర్‌పూర్‌ జిల్లా సికిందర్‌పూర్‌కు చెందిన అక్షత్.. ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం ఆయనకు భోజ్‌పురి సినిమాల్లో నటించారు. కొన్ని టీవీ సీరియళ్లలో కనిపించారు. బాలీవుడ్‌లో అవకాశాలు వస్తుండటంతో ముంబైలో స్థిరపడ్డారు. రెండేళ్లుగా ముంబైలో ఉంటున్నారు. అంధేరి వెస్ట్‌లోని సురేష్ నగర్‌ అద్దెకు నివాసం ఉంటున్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఉరి వేసుకున్న స్థితిలో ఆయన కనిపించారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఉత్కర్ష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Bollywood Actor Akshat Utkarsh From Bihar Dies in Mumbai, Family said that It’s a Murder

ఈ ఉదయం ఆయన స్వస్థలం సికందర్‌పూర్‌కు తరలించారు.ఆత్మహత్య చేసుకోవడానికి మూడు గంటల ముందు అక్షత్ తనతో ఫోన్‌లో మాట్లాడాడని, ఎలాంటి బాధ అతని మాటల్లో వ్యక్తం కాలేదని ఆయన తండ్రి రాజు చౌదరి చెబుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి చెందిన ఘటనలో రియా చక్రవర్తి ప్రమేక్ష్ం ఉన్నట్టుగానే ఉత్కర్ష్ మరణంలో కూడా ఫీమేల్ ఫ్యాక్టర్ ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

Recommended Video

    Deepika Padukone : NCB ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరై 3 సార్లు బోరున ఏడ్చేసిన Deepika Padukone

    స్నేహా చౌహాన్ అనే మరో వర్ధమాన నటి, అకాంక్ష దుబే అనే ఎంబీఏ క్లాస్‌మేట్‌తో ఉత్కర్ష్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి 8:45 నిమిషాలకు తాను అక్షత్‌తో ఫోనులో సంభాషించానని రాజు చౌదరి వెల్లడించారు. అదే రోజు రాత్రి 11:30 నిమిషాలకు బెంగళూరులో నివసిస్తోన్న అక్షత్ సోదరుడికి స్నేహా చౌహాన్ ఫోన్ చేసి.. మరణవార్తను వెల్లడించినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే అక్షత్ ఉత్కర్ష్ మామ రంజూ సింగ్, చిన్నాన్న విక్రాంత్ కిశోర్.. ముంబైకి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు. అక్కడే అంత్యక్రియలను నిర్వహించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+