పెళ్లిపీటలు ఎక్కిన నటి: పొలిటికల్ టాప్ లీడర్ తో..

బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ పెళ్లి పీటలు ఎక్కారు. సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుడు, సమాజ్ వాది పార్టీ యువజన విభాగం నాయకుడు ఫహద్ అహ్మద్ ను పెళ్లాడారు.

ముంబై: బాలీవుడ్ నటి స్వరా భాస్కర్.. పెళ్లి పీటలు ఎక్కారు. తన ప్రియుడు ఫహద్ అహ్మద్ ను పెళ్లాడారు. ఫహద్.. పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక ఉద్యమకారుడు. గతంలో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విద్యార్థి విభాగం నాయకుడిగా పని చేశారు. పీహెచ్‌డీ స్కాలర్, రీసెర్చ్ స్టూడెంట్. అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్ వాది పార్టీలో చేరారు. ఆ పార్టీ మహారాష్ట్ర శాఖ యువజన విభాగం నాయకుడిగా వ్యవహరిస్తోన్నారు.

ఫహద్ అహ్మద్ ను పెళ్లాడినట్లు స్వరాభాస్కర్ తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్పింగ్, కొన్ని ఫొటోలను ఆమె తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లల్లో పోస్ట్ చేశారు. అతి కొద్ది మంది పరిచితులు, సన్నిహితుల మధ్య ఫహద్ ను పెళ్లాడినట్లు చెప్పారు. రాన్‌ఝానా, తను వెడ్స్ మను రిటర్న్స్, నీల్ బత్తే సన్నాట, అనార్కలి ఆఫ్ ఆరా, వీర్ ది వెడ్డింగ్, జహా చార్ యార్.. వంటి సినిమాల్లో స్వరా భాస్కర్ నటించారు. ప్రస్తుతం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మీమాంసలో నటిస్తోన్నారు.

Bollywood actor Swara Bhasker announced that she has married political activist Fahad Ahmad.

స్వరా భాస్కర్ ఇంతకుముందు నవలా రచయిత హిమాన్షు శర్మతో రిలేషన్ లో ఉన్నారు. రాన్ ఝానా సినిమా షూటింగ్ సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సుమారు అయిదు సంవత్సరాల పాటు వారిద్దరూ సహజీవనం చేశారు. ఆ తరువాత తమ రిలేషన్ కు బ్రేకప్ చెప్పారు. 2019లో వారిద్దరూ విడిపోయారు.

Bollywood actor Swara Bhasker announced that she has married political activist Fahad Ahmad.

స్వరా భాస్కర్ కు ఫెమినిస్ట్ గా, కమ్యూనిస్టు భావజాలం ఉన్న మహిళగా పేరుంది. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తోంటారు. విలువల కోసం మాట్లాడటం తాను చేసిన అతిపెద్ద తప్పు అంటూ ఇటీవలే ఓ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. దీని వల్ల తన కెరీర్‌ లో తీవ్రంగా నష్టపోయానని చెప్పారు. కొన్నిసార్లు ఈఎంఐలకు కూడా డబ్బులు కట్టలేని దుస్థితిని ఎదుర్కొన్నానని చెప్పారు. ఇదివరకు ఆమె రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+