Kisi ka Bhai Kisi Ki Jaan: రికార్డులు సృష్టిస్తున్న సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్'..
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఓటీటీలో దూసుకెళ్తోంది. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ దక్షిణాసియా కంటెంట్ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ZEE5 గ్లోబల్ లో స్టీమింగ్ అవుతోంది. జూన్ 23న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి రోజు బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ అందుకుంది.
యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ 2023లో రిలీజ్ రోజే అత్యధికంగా వ్యూయర్ షిప్ సాధించింది. ఇది యాంటిమ్ మరియు రాధేలను అధిగమించింది. విడుదలైన 24 గంటల్లోనే, 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' చిత్రం భారీ వ్యూయర్‌షిప్‌ను సంపాదించింది. ప్లాట్‌ఫారమ్‌లో అత్యధిక వ్యూయర్ షిప్ వచ్చిన రెండవ అతిపెద్ద సినిమాగా నిలిచింది.

కిసీ కా భాయ్ కిసీ కీ జాన్.. తన కుటుంబాన్ని, ప్రియమైన వారిని రక్షించడానికి ఎంత దూరం అయినా వెళ్లగల నిజాయితీ గల వ్యక్తి కథ. నలుగురు అన్నదమ్ముల చుట్టూ తిరిగే ఈ సినిమాని సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. పెద్ద సోదరుడు భాయిజాన్ (సల్మాన్ ఖాన్) తన ముగ్గురు తమ్ముళ్లను (రాఘవ్ జుయల్, జాస్సీ గిల్, సిద్ధార్థ్ నిగమ్ పోషించారు) చూసుకునేలా బ్రహ్మచారి జీవితాన్ని గడపడానికి కట్టుబడి ఉంటాడు.
అతని సోదరులు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతారు. దీంతో అన్నకు పెళ్లి చేయాలని వదినను వెతికే పనిలో పడతారు.హీరోయిన్ పూజా హెగ్డే రాకతో వారి జీవితంలోకి ప్రవేశించడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. హీరోయిన్ కుటుంబాన్ని రక్షించడం కోసం హీరో ప్రయత్నాలు చేస్తాడు. ఈ హై-ఆక్టేన్ యాక్షన్-డ్రామా చిత్రం శృంగార సన్నివేశాలు, కుటుంబ బంధాలు, ఆకట్టుకునే పాటలు, ఆకర్షణీయమైన కథాంశంతో ఈ సినిమాను తెలకెక్కించారు.

"కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ లాంచ్ సందర్భంగా లభించిన బలమైన స్పందన చూసి మేము చాలా సంతోషంగా ఉన్నాము. మేము మా ప్రపంచ వీక్షకులకు ఏడాది పొడవునా బ్లాక్‌బస్టర్ చిత్రాలు, ప్రదర్శనల యొక్క గొప్ప లైనప్‌ని వాగ్దానం చేశాం. ఆ నిబద్ధతకు కట్టుబడి ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము" అని ZEE5 గ్లోబల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అర్చన ఆనంద్ అన్నారు.
"కిసీ కా భాయ్ కిసీ కీ జాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి మేము సంతోషించాము. భాష, లొకేషన్‌తో సంబంధం లేకుండా వీక్షకులను ఒకచోట చేర్చే శక్తి నిజాయితీ కథకు ఎలా ఉందో తెలియజేసింది. ZEE5 గ్లోబల్‌లో బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్‌తో రికార్డ్ బద్దలు కొట్టినందుకు మేము సంతోషిస్తున్నాము. ప్రేక్షకులు సినిమాపై తమ ప్రేమను కురిపిస్తూనే ఉంటారని ఆశిస్తున్నాము" అని దర్శకుడు ఫర్హాద్ సామ్‌జీ చెప్పారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
'ధురంధర్' కు నో చెప్పిన స్టార్ హీరోయిన్.. ఓకే చెప్పి ఉంటే మూవీ ప్లాఫ్..?? -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications