హీరో చియాన్ విక్రమ్ ఇంటికి బాంబు బెదిరింపు: పోలీసులు అలర్ట్, తనిఖీలు
చెన్నై: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇంట్లో బాంబు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని బసంత్‌నగర్‌లో ఉన్న విక్రమ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆగంతకులు పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి చెప్పారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు విక్రమ్ ఇంటికి చేరుకుని గాలింపు చేపట్టారు. బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫ్ఫర్ డాగ్స్ తనిఖీ చేశారు. అయితే, ఎక్కడా ఎలాంటి బాంబు లభ్యం కాలేదు. దీంతో ఇది ఆకతాయిలు చేసిన పనేనని పోలీసులు నిర్ధారించారు. ఆ ఫోన్ చేసినవారెవరో కనిపెట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

కాగా, గతంలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు రజినీకాంత్, విజయ్, సూర్య ఇళ్లల్లోనూ బాంబులు పెట్టినట్లు బెదిరింపులు రావడం గమనార్హం. అంతేగకా, గతంలో ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామికి కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు.
ఇది ఇలావుండగా, ప్రస్తుతం విక్రమ్.. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో 'కోబ్రా' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన ఏడు పాత్రల్లో కనిపిస్తుండటం విశేషం. ఇక మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీటితోపాటు మరో మూడు తమిళ సినిమాలకు కూడా విక్రమ్ సంతకం చేసి బిజీగా ఉన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications