శోభనం రోజు మొగుడు ముందే ప్రియుడికి వీడియో కాల్..ఇక్కడే అసలు ట్విస్ట్
ఈ రోజుల్లో ప్రేమించుకోవడం, పెద్దలు అంగీకరించకపోవడంతో మరో పెళ్లి చేసుకోవడం వంటి ఘటనలు తరచూ చూస్తూనే ఉంటున్నాం. అయితే పెళ్లి తర్వాత కూడా కొందరు మాజీ ప్రియులతో తమ బంధాలను కొనసాగిస్తున్నారు. దీని కారణంగానే కొందరి జీవితాలు నాశనం అవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తిని కాదని, మరో వ్యక్తిని వివాహం చేసుకుంది ఓ యువతి. అయితే ఇష్టం లేని పెళ్లి చేశారనే కోపాన్ని కట్టుకున్న భర్తపై చూపించి అతన్ని హతమార్చాలని చూసింది.
కలైయారసన్ అనే 27 ఏళ్ల యువకుడికి .. ఆర్తి అనే యువతిని ఇచ్చి వివాహం చేశారు. అయితే ఆర్తి అంతకు ముందే మరో వ్యక్తిని గాఢంగా ప్రేమించింది. పెద్దలు ప్రేమ వివాహానికి అంగీకరించకపోవడంతో కలైయారసన్‌ను వివాహం చేసుకుంది. అయితే మొదటి రోజు రాత్రి నుంచే కట్టుకున్న భర్తకు ఆర్తి చుక్కలు చూపించింది. శోభనం రోజునే భర్త ముందు ప్రియుడుకు వీడియో కాల్ చేసి ఈ వివాహం నాకు ఇష్టం లేదని తేల్చి చెప్పింది.మ్యాటర్ అర్థం కావడంతో జరిగింది చెప్పి ఆర్తిని తన పుట్టింట్లో అక్కడే వదిలిపెట్టి వచ్చేశాడు.

అయితే పెద్దలు నచ్చ చెప్పి మళ్లీ భర్త కలైయారసన్ దగ్గర ఆర్తిని వదిలిపెట్టి వెళ్లారు.కానీ ఆమె తీరు మాత్రం మారలేదు. ఒకరోజు తలనొప్పిగా ఉందని టీ ఇవ్వాలని కలైయారసన్ భార్య ఆర్తిని కోరాడు. అయితే ఆమె జ్యూస్ తెచ్చి ఇవ్వడంతో ఆమెలో మార్పు మొదలైందని ఆనందపడ్డాడు.అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఆ జ్యూస్ తాగిన కొద్ది నిమిషాలకే అతను రక్తం వాంతులు చేసుకున్నాడు.ఆ జ్యూస్‌లో విషం కలిపానని చెప్పి భర్త కలైయారసన్‌కు గట్టి షాకే ఇచ్చింది.వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతడ్ని పుదుచ్చేరి ఆస్పత్రికి తరలించారు. కలైయారసన్ ప్రస్తుతం ప్రాణాల కోసం పొరాడుతున్నాడు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆర్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications