Bride: పెళ్లిలోనే వరుడి మెడలో పూలహారం వేస్తూ కుప్పకూలిపోయిన పెళ్లికూతురు, ఆసుపత్రికి వెళితే ?
లక్నో/ఉత్తరప్రదేశ్: యువతి, యువకుడి పెళ్లి ఫిక్స్ అయ్యింది. వధువరుల కుటుంబ సభ్యులు వారి బంధువులు, స్నేహితులు అందర్ని పెళ్లికి పిలిచారు. కల్యాణమండపంలో సాయంత్రం నుంచి రిసెప్షన్ సందడి మొదలైయ్యింది. వేదిక మీద పెళ్లికూతురు. పెళ్లికొడుకు నిలుచుని పెళ్లికి వచ్చి ఆశీర్వదిస్తున్న వారిని పలకరించారు. తరువాత వధూవరులు పూలదండలు మార్చుకునే సమయంలో పెళ్లికూతురు కుప్పకూలిపోయింది. వెంటనే పెళ్లికూతురికి నీళ్లు తాగించడంతో కొంతసేపటి ఆమె కోలుకుంది, తరువాత రిసెప్షన్ పూర్తి చేసి తరువాత జరగవలసిన కార్యక్రమాలు జరిపించారు. ముహుర్తం సమయంలో పెళ్లికూతురు మళ్లీ కుప్పకూలిపోయింది. వెంటనే పెళ్లికూతురిని ఆసుపత్రికి తరలించడంతో అప్పటికే ఆమె ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారు.

పెద్దలు సెట్ చేసిన పెళ్లి
ఉత్తరప్రదేశ్ లోని లక్నో సమీపంలోని భద్వాన్ గ్రామంలో రాజ్ పాల్ శర్మా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రాజ్ పాల్ శర్మాకు శివాంగి శర్మా అనే కుమార్తె ఉంది. లక్నో సమీపంలోని బుద్దేశ్వర్ మోహల్లాలో నివాసం ఉంటున్న వివేక్ తో శివాంగి శర్మా పెళ్లి జరిపించాలని పెద్దలు మాట్లాడుకున్నారు. వివేక్, శివాంగి శర్మా పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సింగ్నల్ ఇచ్చారు.

కల్యాణమండపంలో పెళ్లిసందడి
లక్నో సమీపంలోని భద్వాన్ లో వివేక్, శివాంగి శర్మా పెళ్లి జరిపించాలని డేట్, వేదిక ఫిక్స్ అయ్యింది. వధువరులు వివేక్, శివాంగి శర్మా కుటుంబ సభ్యులు వారి బంధువులు, స్నేహితులు అందర్ని పెళ్లికి పిలిచారు. కల్యాణమండపంలో సాయంత్రం నుంచి రిసెప్షన్ సందడి మొదలైయ్యింది. వేదిక మీద పెళ్లికూతురు శివాంగి శర్మా. పెళ్లికొడుకు వివేక్ నిలుచుని పెళ్లికి వచ్చి ఆశీర్వదిస్తున్న వారిని పలకరించారు.

కుప్పకూలిపోయిన పెళ్లికూతురు
వధూవరులు వివేక్, శివాంగి శర్మా పూలదండలు మార్చుకునే సమయంలో పెళ్లికూతురు శివాంగి శర్మా కుప్పకూలిపోయింది. వెంటనే పెళ్లికూతురు శివాంగి శర్మాకు నీళ్లు తాగించి సమీపంలోని రూమ్ లోకి పిలుచుకుని వెళ్లి అర్దగంట సేపు ఆమెకు ఊరిపి వచ్చేలా ఎవ్వరూ గదిలో లేకుండా చూశారు. కొంతసేపటి పెళ్లికూతురు శివాంగి శర్మా కోలుకుని మామూలుగా కనిపించింది.

ముహూర్తం టైమ్ లో ఏంజరిగిందంటే ?
పెళ్లికూతురు శివాంటి శర్మా కోలుకున్నతరువాత రాత్రి రిసెప్షన్ పూర్తి చేసి తరువాత జరగవలసిన కార్యక్రమాలు జరిపించారు. మరుసటి రోజు ఉదయం కూడా ముహూర్తం ముందు వారి సాంప్రధాయల ప్రకారం అన్ని కార్యక్రమాలు జరిగాయి. ముహుర్తం జరిగే సమయంలో పెళ్లికూతురు శివాంగి శర్మా మళ్లీ కుప్పకూలిపోయింది.

పెళ్లిరోజే పెళ్లికూతురి ప్రాణం పోయింది
వెంటనే పెళ్లికూతురు శివాంగి శర్మాను లక్నోలోని కాస్మాండి కలా ఆసుపత్రికి తరలించారు. పెళ్లికూతురు శివాంగి శర్మాను పరిశీలించి వైద్యులు అప్పటికే ఆమె గుండెపోటుతో చనిపోయిందని చెప్పడంతో ఇరు వైపుల కుటుంబ సభ్యులు హడలిపోయారు. రాత్రికూడా పెళ్లికూతురు శివాంగి శర్మాకు గుండెపోటు వచ్చిందని వైద్యులు చెప్పారు.

రాత్రి ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లకుండా ?
పెళ్లి హడవాడిలో అప్పుడు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడంతో మురుసటి రోజు శివాంగి శర్మా ప్రాణం పోయిందని మలిహాబాద్ పోలీస్ స్టేష్ అధికారి సుభాష్ చంద్ర సరోజ్ స్థానిక మీడియాకు చెప్పారు. పెళ్లిరోజే పెళ్లి కూతురు శివాంగి శర్మా ప్రాణం పోవడంతో రెండు కుటుంబాల్లో విషాదచాయలు నెలకొన్నాయి.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications