girls: శ్రీలంక లేడీస్ ను చైనాలో సేల్ చేస్తున్న లీడర్, ఒక్కో అమ్మాయికి ఎన్ని లక్షలు అంటే ?, షాక్ !
ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్న శ్రీలంక యువతులను థాయ్ ల్యాండ్ కు కాకుండా చైనాకు తరలించిన ఓ పొలిటికల్ లీడర్ అక్కడ వాళ్లను కొన్ని వేల డాలర్లకు చైనీయులకు అమ్మేసి చేతులు దులుపుకుంటున్నాడు.
చెన్నై/శ్రీలంక: ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండటంతో ఉద్యోగం చెయ్యాలని యువతులు అనుకున్నారు. మనం ఉద్యోగాలు చేస్తే కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని అనుకున్నారు. ఓ రాజకీయ నాయకుడి సహకారంతో విదేశాలకు వెళ్లాలని అనుకున్నారు. అయితే తరువాత జరిగింది వేరే. ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్న యువతులను ఆ దేశానికి కాకుండా మరో దేశానికి తరలించి అక్కడ వాళ్లను అమ్మేశారు. అమ్మాయిలను అమ్ముతున్న వ్యక్తికి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలోని కొందరు అండ ఉండటంతో యువతుల పరిస్థితులు అన్నీ తారుమారైనాయి. ఏ అమ్మాయిలను అయితే అమ్మేశారో ఆ అమ్మాయిలు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో ఆ రాజకీయ నాయకుడి కథ మొత్తం అడ్డం తిరిగింది.

థాయ్ ల్యాండ్ లో ఉద్యోగాలు
మనం ఉద్యోగాలు చేస్తే కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని శ్రీలంకలోని యువతులు కొందరు అనుకున్నారు. శ్రీలంకలో ఉద్యోగ అవకాశఆలు లేకపోవడంతో థాయ్ ల్యాండ్ లో ఉద్యోగాలు చెయ్యాలని అనుకున్న యువతులను శ్రీలంకలోలని ఓ రాజకీయ పార్టీ నాయకుడు రుయాన్ పతిరానా సహకారంతో విదేశాలకు వెళ్లాలని అనుకున్నారు.

చైనాలో శ్రీలంక అమ్మాయిలు సేల్
రుయాన్ పతిరానా శ్రీలంక అమ్మాయిలను థాయ్ ల్యాండ్ కు కాకుండా చైనాకు పంపించాడు. చైనాలలో కొందరు బ్రోకర్ల సహాయంలో శ్రీలంక అమ్మాయిలను ఒక్కొక్కరిని 5 వేల డాలర్లకు (భారత కరెన్సీలో రూ. 4. 14 లక్షలు) అమ్మేశారు. శ్రీలంక అమ్మాయిలను కొనుగోలు చేసిన చైనీయులు వారిని చిత్రహింసలు పెట్టారని తెలిసింది. శ్రీలంక అమ్మాయిలను ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారని తెలిసింది.

తప్పించుకుని పరారైన యువతులు
కొందరు అమ్మాయిలు చైనాలోని కొందరి చెర నుంచి తప్పించుకుని థాయ్ ల్యాండ్ పారిపోయి అక్కడి పోలీసులను ఆశ్రయించి మాకు రక్షణ కల్పించాలని మనవి చేశారు. మమ్మల్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో నిలబెట్లారని, చెప్పిన మాట వినడం లేదని కంరెట్ షాక్ పెట్టారని తప్పించుకున్న శ్రీలంక అమ్మాయిలు థాయ్ ల్యాండ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పొలిటికల్ లీడర్ అరెస్టు
థాయ్ లాండ్ పోలీసులు యువతలకు రక్షణ కల్పించి శ్రీలంక పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువతులను విచారణ చేసిన శ్రీలంక పోలీసులు వారు ఇచ్చిన సమాచారంతో అర్దరాత్రి రుయాన్ పతిరానా ఇంటిని చుట్టుముట్టి అతన్ని అరెస్టు చేశారు. అమ్మాయిల స్మగ్లింగ్ గ్యాంగ్ లీడర్ అనురాసేన్ తప్పించుకున్నాడని పోలీసులు అంటున్నారు. 20 ఏళ్ల వయసు ఉన్న నలుగురు యువతులను చైనాలో అమ్మేయడంతో ఆ నలుగురు తప్పించుకుని థాయ్ ల్యాండ్ పోలీసుల సహకారంతో కేసు పెట్టారు. నలుగురు అమ్మాయిలు ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ వారికి జరిగిన అన్యాయం గురించి బోరున విలపించారని శ్రీలంక మీడియా తెలిసింది.

పెళ్లి పేరుతో మోసం చేస్తున్న చైనీయులు
శ్రీలంకు వెళ్లి వస్తున్న కొందరు చైనీయులు శ్రీలంకలోని అందమైన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటామని నమ్మించారని, తరువాత వారిని పెళ్లి చేసుకుని చైనాకు తీసుకెళ్లి అమ్మేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. శ్రీలంకు చెందిన చాలా మంది మహిళలో చైనాలోని కొందరి వలలో చిక్కుకున్నారని, శ్రీలంక మహిళల పట్లు చైనీయులు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నామని శ్రీలంక పోలీసు అధికారులు అంటున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications