Brothers: హలో బ్రదర్స్ కాదు, విదేశాల కిలాడీ బ్రదర్స్, ఇంట్లోనే డ్రగ్స్ ఫ్యాక్టరీ, రూ. 50 లక్షల డ్రగ్స్ !
బెంగళూరు: వ్యాపారం పని మీద బిజినెస్ వీసాతో భారత్ వచ్చిన ఇద్దరు సోదరులు పైకి వ్యాపారం చేస్తున్నామని అందర్ని నమ్మించారు. మొదట దేశరాజధానికి చేరుకున్న సోదరులు తరువాత ఐటీ హబ్ లో మకాం వేశారు. పైకి వ్యాపారుల్లా హలో బ్రదర్స్ టైపులో నటించిన సోదరులు లోపల కిలాడీ బ్రదర్స్ చేసే పనులు చేస్తున్నారు. ఇంట్లోనే లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ తయారు చేసి ఐటీ హబ్ తో పాటు వారికి ఎక్కడెక్కడ నెట్ వర్క్ ఉందో అక్కడికి ఆ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. కిలాడీ సోదరుల మీద నిఘా వేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎంట్రీతో కథ రసవత్తరంగా మారిపోయింది. కిలాడీ సోదరులు వారు నివాసం ఉంటున్న ఇంట్లోనే మినీ డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టారని వెలుగు చూడటంతో పోలీసులు సైతం హడలిపోయారు.

నైజీరియా టూ ఢిల్లీ
నైజీరియాకు చెందిన రిచర్డ్ అనే వ్యక్తి, అతని పెద్ద అన్న బిజినెస్ వీసా మీద భారత్ రావాలని ప్రయత్నించారు. 2019లో బిజినెస్ వీసాతో రిచర్డ్, అతని అన్న దేశరాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. అప్పటి నుంచి ఢిల్లీలోనే ఉంటున్న రిచర్డ్, అతని అన్న ఆరు నెలల క్రితం బెంగళూరు చేరుకున్నారు.

పైకి వ్యాపారం చేస్తున్నామని చెప్పారు
ఆరు నెలల క్రితం బెంగళూరు చేరుకున్న రిచర్డ్, అతని అన్న మొదట రామమూర్తి నగర్ లో అద్దె ఇల్లు తీసుకుని నాలుగు నెలలు అక్కడే ఉన్నారు. రామమూర్తి నగర్ లో నివాసం ఉండే సమయంలో రిచర్డ్, అతని అన్న మేము వ్యాపారం చేస్తున్నామని ఇంటి యజమానితో పాటు స్థానికులను నమ్మించారు.

ఇంట్లో డ్రగ్స్ తయారు చేస్తున్న కిలాడీ బ్రదర్స్
రెండు నెలల క్రితం బెంగళూరు శివార్లలోని సోలదేవనహళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలోని తరబనహళ్ళిలో అద్దె ఇంటిని తీసుకుని రామమూర్తి నగర్ లోని ఇంటిని ఖాళీ చేశారు. పైకి వ్యాపారుల్లా హలో బ్రదర్స్ టైపులో నటించిన రిచర్డ్ సోదరులు లోపల కిలాడీ బ్రదర్స్ చేసే పనులు చేస్తున్నారు. ఇంట్లోనే లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ తయారు చేసి ఐటీ హబ్ బెంగళూరు నగరంతో పాటు వారికి ఎక్కడెక్కడ నెట్ వర్క్ ఉందో అక్కడికి ఆ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.

హడలిపోయిన ప్రజలు..... పోలీసులు షాక్
కచ్చితమైన సమాచారం అందండంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రిచర్డ్ నివాసం ఉంటున్న ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. డ్రగ్స్ తయారు చెయ్యడానికి ఉపయోగించే కెమికల్స్ తో పాటు రసాయనాలు, కుక్కర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దాడి చేసిన సమయంలో రిచర్డ్ పోలీసులకు చిక్కిపోయాడు, రిచర్డ్ ఇంటిలో రూ. 50 లక్షల విలువైన 900 గ్రాముల కోకైన్, 50 గ్రాముల విలువైన ఎండీఎం క్రిష్టల్, ఎండీఎం తయారు చేసే రసాయనాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఢిల్లీలో తలదాచుకున్న రిచర్డ్ అన్న కోసం గాలిస్తున్నామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications