Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Budget 2024: శృంగారంపై పన్ను..ఇలాగైతే ఎలా..?

Budget 2024:ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో పన్ను చెల్లింపుదారుల అంచనాలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ సారి బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదనలు ఉంటాయో ఎవరి అంచనాకు అందడం లేదు.అయితే ఇది బడ్జెట్ సీజన్ కాబట్టి పలు దేశ ప్రభుత్వాలు మన ఊహకు అందని వాటిపై పన్ను విధించేవి. అవి మనకు విచిత్రంగానే కనిపించొచ్చు. కానీ నిజం. శృంగారం పై కూడా పన్ను విధించేవారంటే నమ్మగలరా..ఆవు తేన్పులపై కూడా పన్ను విధించారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శృంగారం పై పన్ను
1971లో అమెరికాలోని రోడ్ఐలాండ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించింది. డెమొక్రటిక్ పార్టీకి చెందిన నాయకుడు బెర్నార్డ్ గ్లాడ్ స్టోన్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు. ప్రతి లైంగిక సంపర్కంపై రెండు డాలర్ల పన్ను విధించాలని ప్రపోజ్ చేశాడు.అయితే అది అమలు కాలేదు.కానీ 2004లో జర్మనీలో ప్రవేశపెట్టిన పన్ను చట్టం ప్రకారం ప్రతి వేశ్య నెలకు 150 యూరోలు పన్నుగా చెల్లించాలి.జర్మనీలో వ్యభిచారం చట్టబద్దమే అయినప్పటికీ.. దీనికోసం సెక్స్ ట్యాక్స్ వంటి చట్టాలు చేయడం జరిగింది. ఇలా శృంగారంపై పన్ను ద్వారా ఏడాదికి 1 మిలియన్ యూరోలు ఖజానాకు చేరేవి.

Budget 2024:From Intimacy to Urine and glass, Unorthodox Taxation Practices in Different Nations

కన్యలపై పన్ను:
9వ శతాబ్దంలో రోమ్‌లో బ్యాచిలర్ పన్ను విధించారు.దీన్ని రోమన్ చక్రవర్తి అగస్టస్ ప్రారంభించారు. వివాహాలను ప్రోత్సహించడమే దీని వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం.అగస్టస్ పిల్లలు లేని వివాహితలపై కూడా పన్ను విధించాడు.ఈ పన్నును 20 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్నవారు చెల్లించాలి.ఇటాలియన్ నియంత బెనిటో ముస్సోలినీ కూడా 1924లో బ్యాచిలర్ ట్యాక్స్ విధించాడు. 21 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న పెళ్లికాని పురుషులపై ఈ పన్ను విధించాడు.

Budget 2024:From Intimacy to Urine and glass, Unorthodox Taxation Practices in Different Nations

కిటికీలపై పన్ను:
1696 ఇంగ్లాండ్‌ వేల్స్ రాజు విలియం -3 కిటికీలపై పన్ను విధించాడు. ఒక ఇంటికి 10 లేదా అంతకంటే ఎక్కువగా కిటికీలు ఉంటే 10 షిల్లింగ్‌ల పన్ను చెల్లించాలని హుకూం జారీ చేశాడు. తమ ఖజానాను మెరుగుపర్చేందుకు ఈ పన్ను విధించినట్లు పేర్కొన్నారు.ఈ పన్ను నుంచి తప్పించుకునేందుకు చాలామంది ప్రజలు తమ కిటికీలను ఇటుకలతో కప్పేశారు. అయితే ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. చివరకు 156 సంవత్సరాల తర్వాత 1891లో ఈ పన్నుకు ముగింపు పలికారు

Budget 2024:From Intimacy to Urine and glass, Unorthodox Taxation Practices in Different Nations

మూత్రం పై పన్ను:
పూర్వపు రోమ్‌లో మూత్రం చాలా విలువైనదిగా పరిగణించేవారు.మూత్రంతో బట్టలు ఉతకడం, పళ్లు తోముకునేందుకు వినియోగించేవారు. మూత్రంలో అమ్మోనియం ఉన్నందున దీనికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు.రోమన్ రాజు వెస్పాసియన్ పబ్లిక్ యూరినల్స్ నుండి మూత్రం పంపిణీపై పన్నును ప్రవేశపెట్టాడు. అతని కుమారుడు టైటస్ ఈ విధానాన్ని ప్రశ్నించినప్పుడు, వెస్పాసియన్ అతని ముక్కుపై నాణెం వేసి, 'డబ్బు దుర్వాసన రాదు' అని చెప్పాడట.

Budget 2024:From Intimacy to Urine and glass, Unorthodox Taxation Practices in Different Nations

ఇలా వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో పన్ను విధించేవారు. ఈ పన్నుల విషయం తెలుసుకున్న వారు నోరెళ్లబెడుతున్నారు. అసలు ఇలాంటి వాటిపై కూడా పన్ను ఉంటుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ చరిత్ర తిరిగేస్తే ఇలాంటి పన్నులు చాలానే కనిపిస్తాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+