ఎయిర్ ఏషియా, ఇండిగో నుంచి.. బంపర్ ఆఫర్!

లోకాస్ట్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఏషియా, ఇండిగో తన ప్రయాణికుల కోసం బంపరాఫర్ ప్రకటించింది. దేశీయంగా ఎంపిక చేసిన మార్గాల్లో అతి తక్కువ ధరకే విమాన టిక్కెట్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి.

న్యూఢిల్లీ: లోకాస్ట్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఏషియా తన ప్రయాణికులకు బంపరాఫర్ ప్రకటించింది. పరిమితకాల ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా ఎయిర్ ఏషియా రూ.1,299కే టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ నెల 5వ తేదీ నుంచి విమాన టికెట్లు అందుబాటులో ఉండగా వచ్చే ఏడాది ఏప్రిల్ 30లోగా ప్రయాణించే వీలుంది. ఎంపిక చేసిన మార్గాల్లోనే ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని ఎయిర్ ఏషియా పేర్కొంది.

air-asia

ఎయిర్ ఏషియా ఆఫర్ చేసిన మార్గాల్లో టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. భువనేశ్వర్-కోల్‌కతా మార్గంలో రూ.1,299కే టికెట్లు ఆఫర్ చేస్తుండగా.. కొచ్చి-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు, గోవా-బెంగళూరు మార్గాల్లో రూ.1,399కే అందుబాటులో ఉంచింది.

భువనేశ్వర్-రాంచి, గువాహటి-ఇంఫాల్ మధ్య టికెట్ ధరను రూ.1,490గా పేర్కొంది. రాంచీ-కోల్‌కతా మధ్య టికెట్ ధర రూ.1,899 కాగా, కోల్‌కతా-వడోదర, గోవా-హైదరాబాద్, పుణె-బెంగళూరు, విశాఖపట్నం-బెంగళూరు మధ్య రూ.1999కే టికెట్లు ఆఫర్ చేస్తోంది.

ఇండిగో నుంచి రూ.1,120కే విమాన టిక్కెట్లు..

విమానయాన సంస్థ ఇండిగో కూడా తన ప్రయాణికుల కోసం 'స్పెషల్ ఆఫర్'లో భాగంగా రూ.1,120కే చెన్నై-బెంగళూరు మార్గంలో విమాన టిక్కెట్లు అందిస్తోంది. అంతేకాదు, జ్మమూ-శ్రీనగర్ మార్గంలో రూ.1,168కి.. ఢిల్లీ-జైపూర్ మార్గంలో రూ.1,178కి టిక్కెట్లు అందిస్తోంది.

ఇక ఇంఫాల్-గువాహటి మార్గంలో రూ.1,212కు.. పూణే-కోల్ కతా మార్గంలో రూ.1,264కు.. భువనేశ్వర్-కోల్ కతా మార్గంలో రూ.1,299కి.. గోవా-బెంగళూరు మార్గంలో రూ.1,316కే టిక్కెట్లు విక్రయిస్తోంది.

అయితే ఇండిగో ప్రయాణికులు నెట్ బ్యాకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా టిక్కెట్ల కొనుగోలు చేస్తే మాత్రం రూ.200 అదనంగా కన్వీనియ్స్ ఫీ కింద చెల్లించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+