ట్రయల్ రూంలో కెమెరా, లేడీస్ దుస్తులు మార్చుకుంటే..

గత గురువారం ఓ మహిళ బట్టల దుకాణంకు వచ్చింది. ట్రయల్ రూంలోకి వెళ్లి బట్టలు మార్చుకుంటున్న సమయంలో ఆమెకు ఓ చిన్న వైర్ కనిపించింది. దానిని పరిశీలించి, ఆ రూంలో కెమెరాను ఏర్పాటు చేసినట్లు గుర్తించింది. ఈ విషయాన్ని తన భర్తకు చెప్పింది. దీనిపై వారు యజమానులను ప్రశ్నించారు.
శనివారం ఆ దంపతులు, వారి బంధువులు వచ్చి కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేశారు. బట్టల దుకాణం యాజమాన్యం ఎదురు దాడికి దిగింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సందీప్, సురేష్‌లను అరెస్టు చేశారు. బట్టల దుకాణంలో పని చేస్తున్న భాషాను కూడా అరెస్టు చేశారు. సునీల్ పరారీలో ఉన్నాడు. కాగా ముగ్గురిని న్యాయస్థానం ముందు పోలీసులు హాజరుపర్చారు. బెయిల్ మీద వారు సోమవారం బయటకు వచ్చారు.












Click it and Unblock the Notifications