72 స్థానాలు, 961 మంది అభ్యర్థులు.. బరిలో హేమాహేమీలు.. రేపే నాలుగో విడత పోలింగ్

ఢిల్లీ : ఏడు విడతల లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. శనివారం నాటితో ప్రచారం ముగియడంతో.. బరిలో నిలిచిన అభ్యర్థులు సోమవారం జరగనున్న పోలింగ్ పై దృష్టి సారించారు. మొత్తం 9 రాష్ట్రాల్లోని 72 పార్లమెంటరీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 961 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. లక్షా 40 వేల పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 12 కోట్ల 79 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

కీలక నియోజకవర్గాలు

కీలక నియోజకవర్గాలు

ఏడు విడతలకు గాను మూడు దశల్లో పోలింగ్ ను విజయవంతంగా పూర్తిచేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక నాలుగో విడత పోలింగ్ సోమవారం నాడు జరగనుంది. ఆ మేరకు ఏర్పాట్లు పూర్తిచేశారు ఈసీ అధికారులు. మహారాష్ర్టలో 17, రాజస్థాన్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 8, ఒడిశా 6, మధ్యప్రదేశ్ 6, బీహార్ 5, జార్ఖండ్ 3, జమ్ముకశ్మీర్‌లో 1 నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది.

నాలుగో విడత పోలింగ్ లో భాగంగా పలు రాష్ట్రాల్లోని కీలక నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ర్టలోని ఉత్తర ముంబయి, దక్షిణ ముంబయి, ఉత్తర మధ్య ముంబయి.. రాజస్థాన్‌లోని జలవర్ బరాన్, జోధ్‌పూర్, బాడ్మేర్.. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్, కన్నౌజ్.. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్.. మధ్యప్రదేశ్‌లోని చింద్వాడ, సిధీ, జబల్‌పూర్ సెగ్మెంట్లు ఉన్నాయి.

పోరులో ప్రముఖులు

పోరులో ప్రముఖులు

నాలుగో విడతతో మహారాష్ట్రలో ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో మాత్రం ఇదే విడత తొలిదశ. అయితే నాలుగో విడతలో భాగంగా పలుచోట్ల రాజకీయ ప్రముఖులు బరిలో నిలిచారు. చింద్వాడ నుంచి మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ కొడుకు నకుల్, జబల్‌పూర్ నుంచి బీజేపీ నేత రాకేశ్‌సింగ్, సిధీ నుంచి కాంగ్రెస్ నేత అజయ్ సింగ్ తలపడుతున్నారు.

 హేమాహేమీలే..!

హేమాహేమీలే..!

నాలుగో విడత ఎన్నికల్లో హేమాహేమీలు బరిలో నిలిచారు. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ సీనియర్ లీడర్ సునీల్‌దత్ కూతురు ప్రియాదత్, బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్, బీజేపీ నేత పూనమ్ మహాజన్ ఎంపీలుగా పోటీచేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ నుంచి నామినేషన్ వేశారు.

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ జోధ్‌పూర్‌ సెగ్మెంట్ నుంచి పోటీచేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్‌ తో వైభవ్ తలపడుతున్నారు. పశ్చిమ బెంగాల్ అసన్‌సోల్ నుంచి బీజేపీ లీడర్ బాబుల్ సుప్రియో పోటీలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+