వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెప్పలేం: నీరవ్ మోడీపై ఇండియాకు అమెరికా షాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

PNB-Nirav Modi Fraud : CBI Recovered Documents

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) కుంభకోణం కేసు ప్రధాన నిందితుడు నీరవ్ మోడీపై అమెరికా చేతులెత్తేసింది. నీరవ్ మోడీ తమ దేశంలో ఉన్నట్లు మీడియా వార్తలను బట్టి తెలుస్తోందని, అయితే దాన్ని ధృవీకరించలేమని అమెరికా విదేశాంగ శాఖ అదికార ప్రతినిధి శుక్రవారం అన్నారు.

నీరవ్ మోడీ న్యూయార్క్‌లో ఉన్నట్లు వచ్చిన వార్తాకథనాలపై పిటిఐతో ఆవిధంగా అన్నారు. నీరవ్ మోడీ ఆచూకీ కనిపెట్టడానికి భారత ప్రభుత్వానికి సాయం అందిస్తారా అని అడిగితే, నీరవ్ మోడీ దర్యాప్తునకు సంబంధించి భారత అధికారులకు న్యాయ సహాయం అందించే విషయం న్యాయశాఖ చూసుకుంటుందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అన్నారు.

Nirav Modi

అయితే, మోడీపై వ్యాఖ్యానించడానికి జస్టిస్ డిపార్ట్‌మెంట్ నిరాకరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ు 12 వేల కోట్ల రూపాయల మేరకు ముంచిన కేసులో నీరవ్ మోడీని, ఆయన మామ మెహుల్ చోక్సీని విచారించాలని సిబిఐ భావిస్తోంది.

నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ జనవరి మొదటివారంలో భారతదేశం వదిలి పారిపోయారు. వారి కోసం సిబిఐ అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తాను వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉన్నందున విచారణ నిమిత్తం ఇండియాకు రాలేనని నీరవ్ మోడీ చెప్పారు.

English summary
The United States government is aware of media reports that diamond jeweller Nirav Modi is in the country but is unable to confirm them, a State Department official said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X