వైరల్ వీడియో: 'ఇండియన్ ట్రైన్ లో ఇది ఊహించలేదు'

ఇండియన్ రైల్వేస్..భారత్ లోని అతిపెద్ద రవాణా వ్యవస్థగా అలాగే ఆసియాలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ గా ఉంది. 1853 నుంచి భారత్ లో నిరంతరాయంగా రైలు సర్వీసులు నడుస్తూనే ఉన్నాయి. అలాగే ఇండియన్ ట్రైన్స్ లో ధర తక్కువ, సదుపాయాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తాజాగా కెనడాకు చెందిన ఓ యువతి భారత్ లో పర్యటించింది. ఈ మేరకు తనకు ఇండియన్ ట్రైన్స్ అంటే ఇష్టమని.. ఇండియన్ రైల్వేస్ తో లవ్ లో పడిపోయానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Canadian Influencer Rachel Reimer Hurley Lauds Indian Railways in Viral Video

కెనడాకు చెందిన సోషల్ మీడియో ఇన్ ఫ్లూయెన్సర్ రచేల్ రీమర్ హర్లీ.. ఇండియన్ రైల్వేస్ అంటే చాలా ఇష్టమని చెబుతోంది. ఇండియన్ రైల్వేస్ ను ప్రశంసిస్తూ ఓ వీడియో పోస్టు చేసింది. అది కాస్త వన్ మిలియన్ వ్యూస్ సాధించి వైరల్ గా మారింది. హర్లీ.. ఏసీ కంపార్ట్ మెంట్ లో ప్రయాణించింది. ఈ టికెట్ 12 డాలర్లు పెట్టి కొనుగోలు చేసింది. రైల్లో వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంది. ఇండియా లో ట్రైన్స్ చీప్ అని అలాగే సౌకర్యవంతమైనవని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోను కెనడా, భారత్ కాకుండా మిగతా దేశాల ప్రజలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ వీడయోలో హర్లీ జర్నీ.. ఉదయం 5 గంటలకు స్టార్ట్ అయింది. భారత్ లోని చాలా రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ప్లాట్ ఫామ్ మీదే నిద్ర పోతున్నారని.. మరి కొందరు రన్నింగ్ ట్రైన్ నుంచే దిగేస్తున్నారని.. ఇలాంటివి ఇండియాలో కామన్ అని పేర్కొంది. ఇక తన ఏసీ టికెట్ ధర కేవలం 12 డాలర్లు మాత్రమేనని తెలిపింది. చాలా చీప్ అని పేర్కొంది. ఏసీ బెర్తులో తనకు షీట్, దిండు, బ్లాంకెట్ ఇచ్చినట్లు స్పష్టం చేసింది. తన ఏడు గంటల జర్నీలో కేవలం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తీసుకున్నట్లు వివరించింది. ఇండియాలో ప్రయాణించాలంటే రైలు ప్రయాణం మాత్రమే చీప్ అండ్ బెస్ట్ అని పేర్కొంది. అలాగే ఈ వీడియోలో ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి. అని పూర్తి వివరాలను వీడియో కింద పోస్టు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+