
యువతి ఎదుటే ప్యాంట్ విప్పేసి, ఆమె వెంటే, ఏమైందంటే?
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు నగరంలో ఓ కారు డ్రైవర్ బస్ కోసం ఎదురు చూస్తున్న యువతిని చూస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. అతడిని చూసి భయపడిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మహిళలపై రోజు రోజుకు దాడులు, దౌర్జన్యాలు పెరుగుతూనే ఉన్నాయి. పాలకులు ఎన్ని చర్యలు తీసుకొన్నా దేశంలో ఏదో ఒక చోట మహిళలపై లైంగిక వేధింపులు చోటు చేసుకొంటున్నాయి.
అయితే ఈ తరహ ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులు అందే ఘటనలు తక్కువగా ఉన్నాయి. అయితే పోలీసుల దృష్టికి రాని ఘటనలు ఎక్కువగానే ఉన్నాయనే మహిళా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

యువతిని చూస్తూ ప్యాంట్ విప్పేసి
కర్ణాటక రాష్ట్రంలోని ఓ కారు డ్రైవర్ నగరంలోని వసంతనగర మౌంట్ కార్మెల్ కాలేజీ బస్టాండ్‌లో నిలుచున్న యువతిని చూస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి పట్ల డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. అతడిని చూసిన బాధితురాలు భయబ్రాంతులకు గురైంది.వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నిందితుడి కోసం పోలీసుల గాలింపు
మార్చి3వ తేదిన వసంతనగర మౌంట్ కార్మెల్ కాలేజీ బస్సు స్టాప్ వద్ద యువతి బస్సు కోసం వేచి చూస్తుంది. ఆ సమయంలో కేఏ-53సీ1877 నెంబర్ కారుకు సంబంధించిన డ్రైవర్ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్యాంట్ విప్పి కారు డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

వెంబడించిన కారు డ్రైవర్
కారు డ్రైవర్ వ్యవహరశైలితో భయంతో తాను వేరే చోటికి వెళ్ళిన నిందితుడు తనను ఫాలో అయ్యాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్దకు వచ్చి మరోసారి ప్యాంట్ విప్పేసి తిరిగి అదే పనిచేశాడని ఆమె చెప్పారు

నిందితుడిపై కేసు నమోదు
బాధిత యువతి ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 294, 509 క్రింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్నారు. బహిరంగ ప్రదేశంలో అసభ్యకరంగా ప్రవర్తించిన కారు డ్రైవర్ కోసం పోలీసులు తీవ్ర గాలింపు చేపట్టారు.