మాజీ ప్రధాని, మాజీ సీఎంకు అవమానం, అధికార పార్టీ లీడర్స్ పై కేసు, సెక్స్ స్యాండల్ కేసులో !

హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియో కేసు కర్ణాటకలో రచ్చరచ్చ అవుతోంది. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ మీద వచ్చి సెక్స్ స్యాండల్ వీడియో ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్ డీ దేవేగౌడకు స్వయనా మనుమడు, సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన ఈ కేసును కాంగ్రెస్ నాయకులు రాజకీయంగా వాడుకుంటున్నారనే చర్చ మొదలైంది.

వీటన్నింటి మధ్య ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలపై జేడీఎస్ ఫిర్యాదు చేసింది. ప్రజ్వల్ రేవణ్ణపై కాంగ్రెస్ నిరసనలు చేపట్టడం ఇప్పుడు జేడీఎస్ ఆగ్రహానికి కారణమైంది. కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తున్న ధర్నాలు, నిరసనల కార్యక్రమాల్లో హెచ్‌డీ దేవెగౌడ, హెచ్‌డీ కుమారస్వామిలను కాంగ్రెస్ కార్యకర్తలు అవమానించారని జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు లీక్ చేసింది ఎవరు ?, ఆ వీడియోలు వాటికంతఅవే లీక్ అయ్యాయా? అని జేడీఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Case against ruling party leaders for insulting former Prime Minister and former CM

కాంగ్రెస్ కార్యకర్తలను డీకే శివకుమార్ రెచ్చగొట్టి మాజీ ప్రధాని, మాజీ సీఎంలను అవమానించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని జేడీఎస్ కార్యకర్తలు ఆరోపించారు. మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ, మాజీ సీఎం, జేడీఎస్ పార్టీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు హెచ్ డీ కుమారస్వామిని అవమానిస్తూ, వారి పరువుకు భంగం కలిగేలా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై బెంగళూరు నగర పోలీసు కమీషనర్ కు జేడీఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు

జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామిని కావాలనే ప్రజల ముందు అవమానించిన వారిని అరెస్ట్ చేసి విచారణ జరిపించాలని జేడీఎస్ నాయకులు బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కు మనవి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఇలాగే ప్రవర్థిస్తే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జేడీఎస్ నాయకులు హెచ్చరించారు.


హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్యాండల్ పెన్ డ్రైవ్ వీడియో కేసును విచారించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇదే సమయంలో ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ మీడియాతో మాట్లాడుతూ ఇది పాత కేసు అని, చట్టపరంగా విచారణకు ప్రజ్వల్ హాజరు అవుతాడని, అందులో ఎలాంటి అనుమానం లేదని మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అన్నారు. జేడీఎస్ పార్టీ నాయకుల సహనాన్ని పరీక్షించకూడదని మాజీ సీఎం రేవణ్ణ అన్నారు. ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణను జేడీఎస్ పార్టీ నుంచి బహిష్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+