ట్యాక్స్ పేయర్స్ కు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్

IT Returns filing: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఐటీఆర్ ఫైలింగ్స్ గడువును పొడిగించింది. ఈ విషయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది.

సాధారణంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం విధించే గడువు జూలై 31. ఈ ఏడాది కూడా ఈ గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. తాజాగా ఈ గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించినట్లు సీబీడీటీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ లన్నీ గడువులోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇదే తొలి పొడిగింపు. మున్ముందు మళ్లీ ఉండకపోవచ్చు.

CBDT has decided to extend the due date of filing of ITR

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన దరఖాస్తుల్లో గణనీయమైన సవరణలు చేసింది సీబీడీటీ. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. దీనికి అనుగుణంగా సిస్టమ్ డెవలప్ చేసింది. ఫలితంగా- ఈ ప్రాసెస్ అవసరాలకు అనుగుణంగా ఐటీఆర్ ఫైలింగ్స్ లో కొంత సమయం తీసుకుంటుంది.

ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ క్రెడిట్ రెఫ్లెక్షన్ కారణంగా ఐటీ ఫైలింగ్ లో ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఆ సమయంలో కోట్ల సంఖ్యలో దాఖలు అయ్యే ఐటీఆర్ ఫైలింగ్స్ లల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి గడువును పొడిగించినట్లు సీబీడీటీ వెల్లడించింది.

సాధారణంగా ముగియాల్సిన గడువు కంటే రెండున్నర నెలల సమయం అదనంగా ఇచ్చినందున ఐటీ ఫైలింగ్స్ సజావుగా సాగుతాయని సీబీడీటీ భావిస్తోంది. పన్ను చెల్లింపుదారుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందకముందే ఈ నిర్ణయాన్ని తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+