ఫోర్న్ వీడియోల కింగ్ పిన్ ఒకే ఒక్కడు

న్యూఢిల్లీ/బెంగళూరు: ఆన్ లైన్ లో అభ్యంతరకర ఫోర్నో వీడియోలు పోస్టు చేసింది ఒకే ఒక్కడు అని సీబీఐ అధికారులు నిర్దారించారు. అతని నుండి పూర్తి వివరాలు సేకరించిన సీబీఐ అధికారులు ఒక నివేదిక తయారు చేశారు.

20 సంవత్సరాలు పూర్తికాని ఆ యువకుడి టాలెంట్ చూసి సీబీఐ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం యువతి, యువకుడు ఏకాంతంగా గడిపిన దృశ్యాలను చిత్రీకరించి ఆ క్లిప్పింగ్ లను ఆన్ లైన్ లో పోస్ట్ చేశారు. వాట్సాప్ లో ఆ దృశ్యాలు పాపులర్ అయ్యాయి.

దాదాపు ఎక్కడ చూసినా ఆ క్లిప్పింగ్ ల గురించే చర్చ జరిగింది. విషయం తెలుసుకున్న హైదరాబాద్ కు చెందిన ప్రజ్వల స్వచ్చంద సంస్థ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తుకు లేఖ వ్రాసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మనవి చేశారు.

సుప్రీం కోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఫోర్న్ వీడియోలు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తున్న నిందితులను గుర్తించి అరెస్టు చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు పలు కోణాలలో దర్యాప్తు చేశారు.

 CBI Sources said Porn Kingpin Kaushik Kuonar

బెంగళూరు నగరంలో అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన కౌశిక్ కౌనార్ (20) అనే యువకుడు ఫోర్న్ వీడియోలు ఆన్ లైన్ లో పోస్ట్ చేస్తున్నాడని గుర్తించారు. గత నెల మేలో సీబీఐ అధికారులు కౌశిక్ కౌనర్ ను అరెస్టు చేశారు.

నిందితుడి నుండి 500 ఫోర్న్ వీడియో క్లిప్పింగ్ లు, అత్యాధునిక ఎడిటింగ్ సాఫ్ట్ వేర్, హార్డ్ డిస్క్, రహస్య కెమెరాలు స్వాదీనం చేసుకున్నారు. ఇతను ఫోర్న్ సైట్ ల నుండి భారతీయ మహిళలు, అమ్మాయిల అభ్యంతరకర వీడియోలు డౌన్ లోడ్ చేసుకుంటున్నాడు.

తరువాత వాటిని అత్యాధునిక ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి వాటిని ఎడిట్ చేస్తున్నాడు. మళ్లి ఆ వీడియో క్లిప్పింగ్ లను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసి ఎవరైనా వాటిని క్లిక్ చేస్తే అతని అకౌంట్ లో డబ్బులు జమ అయ్యేటట్లు అన్నిఏర్పాట్లు చేసుకున్నాడని సీబీఐ అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఈ ఫోర్న్ వీడియో రాకెట్ కింగ్ పిన్ కౌశిక్ కౌనార్ ఒక్కడే అని సీబీఐ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+