బెంగళూరులో హుక్కా బార్ నిర్వహిస్తున్న కన్నడ హీరో అరెస్టు!

బెంగళూరు: నియమాలు ఉల్లంఘించి హుక్కా బార్ నిర్వహిస్తున్న కన్నడ నటుడితో పాటు 7 మందిని బెంగళూరు సీసీబీ పోలీసులు చంద్రాలేఔట్ లో అరెస్టు చేశారు. ముద్దు మనసే అనే కన్నడ సినిమాలో హీరోగా నటించిన అరుణ్ గౌడను అరెస్టు చేశామని మంగళవారం సీనియర్ పోలీసు అధికారి ఎస్. రవి చెప్పారు.

CCB Police, Bengaluru raided Hookah Bar in Chandra Layout yesterday

బెంగళూరు నగరంలోని చంద్రాలేఔట్ లోని హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలో చార్ కోల్ కేఫ్ అనే హుక్కా బార్ నిర్వహిస్తున్నారు. నియమాలు ఉల్లంఘించి బహిరంగంగా హుక్కా బార్ నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న బెంగళూరు సీసీబీ పోలీసులు దాడి చేశారు.

అరుణ్ గౌడ మరో వ్యక్తితో కలిసి అక్రమంగా హుక్కా బార్ నిర్వహిస్తున్నాడని పోలీసు అధికారి ఎస్. రవి తెలిపారు. నటుడు అరుణ్ గౌడతో పాటు మంజునాథ్ మహేష్ బాబు తో సహ ఏడు మందిని అరెస్టు చేసి నగదు, హుక్కా స్టాండ్లు స్వాధీనం చేసుకున్నామని సీసీబీ పోలీసు అధికారి ఎస్. రవి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+