ఎత్తికుదేసి: చిన్నారిపై ట్యూటర్ పైశాచికం, సీసీటీవీలో...

kolkatha
కోల్‌కతా: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని అంధుల పాఠశాలలో ముగ్గురు అంధ విద్యార్థుల పైన ఉపాధ్యాయుడు దారుణంగా చితకబాదిన ఘటన మరవకముందే.. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో మరో సంఘటన వెలుగు చూసింది. ఓ ట్యూటర్ మూడేళ్ల చిన్నారని దారుణంగా కొట్టిన సంఘటన సీసీటీవీ ఫుటేజీ ద్వారా బయటకు వచ్చింది.

నాలుగేళ్ల బాలుడిని ఇష్టం వచ్చినట్లుగా తన్నడం, ఎత్తి కుదేయడం చేసింది. ఆ ట్యూటర్ ఇటీవలే ఉద్యోగంలో చేరింది. అయితే, చిన్నారి పట్ల అమానుషంగా, పైశాచికంగా ప్రవర్తించింది. దీనిపై తల్లిదండ్లులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీసీటీవీ ఫుటేజ్‌లో.. సదరు ట్యూటర్ ఆ చిన్నారిని బెడ్ పైకి తోసిసినట్లుగా ఉంది. ఆ సమయంలో తల్లిదండ్రులు బయట ఉన్నారు. చిన్నారని ట్యూటర్ అతని గదిలోకి తీసుకు వెళ్లింది. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. అక్కడ ఆ చిన్నారి పైన పైశాచికంగా ప్రవర్తించిన దృశ్యాలను కెమెరా బందించింది.

ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. కోల్‌కతాలోని లేక్ టౌన్‌లో ఇది జరిగింది. ట్యూటర్ జూలై 15వ తేదీన జాయిన్ అయింది. హోంట్యూషన్‌కు వచ్చిన రోజు నుండే ఆమె ఆ చిన్నారిని కొట్టడం ప్రారంభించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+