కుప్పకూలిన ఎయిర్‌పోర్ట్ సీలింగ్
Heavy Rains: దక్షిణాది రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. నడివేసివి రాకముందే తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉక్కపోతకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడదెబ్బకూ గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తోన్నాయి.
ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఇలా ఉండట్లేదు. అక్కడ భారీ వర్షాలు కురుస్తోన్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తోన్నాయి. ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షాల వల్ల జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బిక్కు బిక్కు మంటూ గడిపే పరిస్థితి ఉంది.

ఈ వర్షాల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే- అస్సాం గువాహటిలో గల లోక్‌ప్రియ గోపీనాథ్ బొర్డొలాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పైకప్పు సైతం కుప్పకూలిపోయింది. విమానాశ్రయం ఆవరణలో ఈ ఘటన చోటు చేసుకుంది. పైకప్పు కొంతభాగం మొత్తం భళ్లుమంటూ కుప్పకూలింది. వర్షపునీరు మొత్తం లోనికి ప్రవహించింది.
భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల వల్ల ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చీఫ్ ఎయిర్‌పోర్ట్ ఆఫీసర్ ఉత్పల్ బారువా చెప్పారు. వర్షపునీటిని బయటికి తీసుకెళ్లే పైపులు పగిలిపోయాయని, నీరంతా సీలింగ్‌పై ప్రవహించిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదని అన్నారు. వెంటనే సీలింగ్ మరమ్మతు పనులను చేపట్టామని బారువా వివరించారు.
Portion of Guwahati airport ceiling collapses due to heavy rain.#GuwahatiAirport #AssamRain pic.twitter.com/3r000j2h8d
— Afroz Alam (@AfrozJournalist) April 1, 2024
దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారీ వర్షాలు, వెలుతురు లేమి, ప్రతికూల వాతావరణం వల్ల విమానాల రాకపోకలను కూడా అధికారులు నిలిపివేశారు. పాక్షికంగా మూసివేశారు. ఆరు విమానాలను మళ్లించారు. వర్షం తీవ్రత తగ్గిన తరువాత మళ్లీ విమానాల రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు చెప్పారు.
-
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
బిల్ గేట్స్ వర్షాలను కంట్రోల్ చేస్తున్నారా? 'వార్' ఆన్ వెదర్! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications