Celebrity: ఉగ్రవాదులు, మాఫియా డాన్ లు ఉన్న జైల్లో షారుక్ ఖాన్ కొడుకు, సంజయ్ దత్, కసబ్ కూడా !

ముంబాయి/ బెంగళూరు: ముంబాయి నుంచి గోవా వెలుతున్న క్రాయిజ్ షిప్ లో డ్రగ్స్ సేవించి రేవ్ పార్టీ జరుపుకుంటున్నారని ఆరోపిస్తూ అరెస్టు అయిన బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. బెయిల్ రాకపోవడంతో ఆర్యన్ ఖాన్ అండ్ కో ఇప్పుడు ముంబాయిలోని ఆర్థర్ రోడ్డులోని సెంట్రల్ జైల్లో ఉంటున్నారు. ప్రతి వీకెండ్ లో ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసే యువ సెలబ్రిటీ ఆర్యన్ ఖాన్ ఈసారి మాత్రం వీకెండ్ ను ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైల్లో జరుపుకున్నాడు.

బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించడంతో ఇప్పుడు ఆర్యన్ ఖాన్ న్యాయవాదులు సెషన్స్ కోర్టును ఆశ్రయించడానికి ప్రయత్నిస్తున్నారు. అన్నట్లు షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఉన్న సెంట్రల్ జైలుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కరుడుగట్టిన ఉగ్రవాదులు, దేశద్రోహులు, మాఫియా డాన్ లు కాలం గడిపిన ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైలు (ముంబాయి సెంట్రల్ జైలు)లోనే ఇప్పుడు షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్, అతనితో పాటు రేవ్ పార్టీలో పాల్గొన్న బిగ్ షాట్స్ కొడుకులు ఉంటున్నారు. షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఉన్న జైల్లో ఎవరెవరు జైలు శిక్ష అనుభవించారో అనే విషయంలో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే !

 షారుక్ ఖాన్ కు పలుకుబడి ఎక్కువ

షారుక్ ఖాన్ కు పలుకుబడి ఎక్కువ

డ్రగ్స్ కేసు, రేవ్ పార్టీ కేసులో అరెస్టు అయిన ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇవ్వకూడదని ఎన్ సీబీ అధికారులు కోర్టుకు మనవి చేశారు. కేసు విచారణలో ఉన్న సమయంలో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇస్తే కేసు విచారణ మొత్తం నీరుకారిపోయే అవకాశం ఉందని, అతని కుటుంబం చాలా పలుకుబడి కలిగిన కుటుంబమని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఎన్ సీబీ అధికారులు అన్నారు

సార్ కు నో బెయిల్

సార్ కు నో బెయిల్

సాక్షులు ప్రభావితం కాకుండా ఉండాంటే ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇవ్వకూడదని ఎన్ సీబీ అధికారులు కోర్టులో మనవి చేశారు. ఎన్ సీబీ అధికారులు అభ్యంతరం చెప్పడంతో ఆర్యన్ ఖాన్ కు కోర్టు బెయిల్ మంజూరు చెయ్యలేదని. బెయిల్ రాకపోవడంతో ఆర్యన్ ఖాన్ తో సహ ఆ కేసులో అరెస్టు అయిన మిగిలిన నిందితులను ముంబాయిలోని ఆర్థర్ రోడ్డులోని సెంట్రల్ జైలుకు తరలించారు.

 డ్రగ్స్ ఎక్కడా , పెద్ద ఫ్యామిలీ తెలుసుకదా , ఎక్కడికి పోతాడు ?

డ్రగ్స్ ఎక్కడా , పెద్ద ఫ్యామిలీ తెలుసుకదా , ఎక్కడికి పోతాడు ?

ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ స్వాధీనం చేసుకోలేదని ఎన్ సీబీ అధికారులు అంటున్నారు అలాంటప్పుడు బెయిల్ మంజూరు చెయ్యాలని అతని న్యాయవాదులు అంటున్నారు. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పడం సరికాదని అంటున్నారు. ఆర్యన్ ఖాన్ ఫ్యామిలీ చాలా పెద్దది, బెయిల్ ఇస్తే అతని పారిపోయే అవకాశం లేదని, విచారణకు కచ్చితంగా హాజరు అవుతారని ఆయన న్యాయవాదులు అంటున్నారు.

 రియా చక్రవర్తికి బెయిల్ ఇస్తే హాజరు అవుతున్నారు కదా !

రియా చక్రవర్తికి బెయిల్ ఇస్తే హాజరు అవుతున్నారు కదా !

గతంలో కూడా చాలా మంది బెయిల్ తీసుకుని బయటకు వచ్చి అధికారుల విచారణకు హాజరు అయ్యారని ఆర్యన్ ఖాన్ న్యాయవాదులు అంటున్నారు. డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన రియా చక్రవర్తి కూడా బెయిల్ మీద బయట ఉంటూ అధికారుల విచారణకు హాజరయ్యారు కదా అంటూ ఆర్యన్ ఖాన్ న్యాయవాదులు అంటున్నారు. బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించడంతో ఇప్పుడు ఆర్యన్ ఖాన్ న్యాయవాదులు సెషన్స్ కోర్టును ఆశ్రయించడానికి ప్రయత్నిస్తున్నారు.

 ఈసారి వీకెండ్ ను ఇలా కానించేసిన యువ సెలబ్రిటీ

ఈసారి వీకెండ్ ను ఇలా కానించేసిన యువ సెలబ్రిటీ

ప్రతి వీకెండ్ లో ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసే యువ సెలబ్రిటీ ఆర్యన్ ఖాన్ ఈసారి మాత్రం వీకెండ్ ను ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైల్లో జరుపుకున్నాడు. షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఉన్న సెంట్రల్ జైలుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైలును ముంబాయి సెంట్రల్ జైలుగా పిలుస్తారు.

 ఉగ్రవాదులు, మాఫియా డాన్ లు

ఉగ్రవాదులు, మాఫియా డాన్ లు

కరుడుగట్టిన ఉగ్రవాదులు, దేశద్రోహకులు, మాఫియా డాన్ లు కాలం గడిపిన ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైలు (ముంబాయి సెంట్రల్ జైలు)లోనే ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్, అతనితో పాటు రేవ్ పార్టీలో పాల్గొన్న బిగ్ షాట్స్ కొడుకులు ఉంటున్నారు. ముంబాయిలోని ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైలు పేరు చెబితే చాలా మంది గుర్తుకు వచ్చేస్తారు.

 బ్రిటీష్ కాలం నాటి సెంట్రల్ జైలు

బ్రిటీష్ కాలం నాటి సెంట్రల్ జైలు

ముంబాయిలోని ఆర్థర్ రోడ్డు జైలను ముంబాయి సెంట్రల్ జైలు అని కూడా పిలుస్తారు. 1926లో బ్రిటీష్ అధికారులు ఆర్థర్ రోడ్డు జైలు నిర్మించారు. రెండు ఎకరాల్లో నిర్మించిన ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైలును 1976లో కేంద్ర కారాగారం అని ప్రకటించారు. ఆర్థర్ రోడ్డు జైలులో 800 మంది ఖైదీలు ఉండటానికి అవకాశం ఉంది. 2020లో 8 కొత్త బ్యారెక్ లు నిర్మించడంతో ఇప్పుడు అదనంగా మరో 200 మంది ఖైదీలు ఇక్కడ ఉండటానికి అవకాశం ఉంది.

 ఇదే జైల్లో బాలీవుడ్ హీరో సంజయ్ దత్

ఇదే జైల్లో బాలీవుడ్ హీరో సంజయ్ దత్

1993 ముంబాయి వరుస బాంబు పేలుళ్ల కేసులో అరెస్టు అయిన బాలీవుడ్ టాప్ హీరో సంజయ్ దత్ ఇదే ఆర్థర్ రోడ్డు జైల్లో శిక్ష అనుభవించాడు. ఇదే జైల్లో శిక్షఅనుభవించిన సంజయ్ దత్ తరువాత బయటకు వచ్చాడు. మాఫియా డాన్ ఛోటా రాజన్ ను కూడా తాత్కాలికంగా మొదట ఇదే ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైల్లో పెట్టారు. ప్రస్తుతం ఛోటా రాజన్ తీహార్ సెంట్రల్ జైల్లో ఉంటున్నాడు. ఛోటా రాజన్ మీద అనేక క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.

పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్

పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్

ముంబాయిలో 2008లో జరిగిన దాడుల ( 26/11 దాడులు) కేసులో అరెస్టు అయిన పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ కూడా ఇదే ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైలులోనే ఉన్నాడు. కసబ్ ను ఇదే జైలులో విచారణ చేసి అదని దోషిగా తేల్చారు. తరువాత 2012లో పూణేలోని యారవాడ సెంట్రల్ జైల్లో పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను ఉరి తీశారు.

Recommended Video

    Samantha As Next Guest In NTR's Show ? Reports | Oneindia Telugu
     మాఫియా డాన్ లు, క్రిమినల్స్

    మాఫియా డాన్ లు, క్రిమినల్స్

    1993 ముంబాయి వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన అబు సలేం కూడా ఇదే ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. తరువాత ముస్తఫా దోసా మీద దాడులు చేసిన తరువాత అబు సలేం ను తలోజా సెంట్రల్ జైలుకు తరలించారు. 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న ముస్తఫా దోసా ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైల్లోనే ఉన్నాడు. 2017లో ముస్తఫా దోసాకు గుండెపోటు రావడంతో అతని ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైలు నుంచి ముంబాయిలోని జేజే ఆసుపత్రికి తరలించడంతో అక్కడే అతను మరణించాడు. అరుణ్ గౌలి కూడా ఇదే జైల్లో ఉన్నాడు. ఇలా ఎందరో ఉగ్రవాదులు, మాఫియా డాన్ లు, క్రిమినల్స్ ఉన్న ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైల్లో ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఉండటంతో మరోసారి ఆజైలు పేరు వార్తల్లోకి వచ్చింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+