వరి కొనం.. కేంద్రం స్పష్టీకరణ, ప్రత్యామ్నాయమే మార్గమా..?

యాసంగిలో వరి కొనుగోలుపై ఎట్టకేలకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దీంతో తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల పంచాయితీకి ఫుల్ స్టాప్ పడినట్లు కనిపిస్తుంది. వరిధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రంతో చర్చించేందుకు ఇటీవలే సీఎ కేసీఆర్, మంత్రివర్గ బృందం ఢిల్లీకి వెళ్లింది. ప్రధాన మంత్రి అపాయింట్ మెంట్ దొరకకపోవడంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారులు భేటీ అయ్యారు.

 central government tell to state, not buying paddy

వరిధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రి స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. యాసంగిలో వరి పంట వెయ్యొద్దని కేంద్రం గట్టిగా చెప్పినట్లు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సమావేశంలో గోయల్ వరి కొనుగోళ్లపై ఆయన స్పష్టత ఇచ్చినట్లుగా తెలిపారు నిరంజన్ రెడ్డి. వరి ధాన్యం కొనే ప్రసక్తే లేదని కేంద్రం ఖరాకండిగా చెప్పినట్లు మంత్రి వివరించారు. మొదట వానాకాలం, యాసంగి (2021-22) రెండు సీజన్లలో కలిపి 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. యాసంగిలో ఎంత మొత్తంలో ధాన్యం సేకరిస్తారో చెబితే రైతులకు స్పష్టత ఇస్తామని వెల్లడిస్తోంది. రెండు పంటల్లో కలిపి ఎంత ధాన్యం సేకరిస్తారో కేంద్రం ఒకేసారి తెలపాలని సూచిస్తోంది. తెలంగాణ ప్రతిపాదనను కేంద్రం పక్కకు పెట్టింది. ధాన్యం కొనుగోళ్లపై క్లారిటీ ఇచ్చింది.

Recommended Video

    Tollywood స్టార్ హీరోలకు షాక్, AP లో No Benefit Shows | AP Govt || Oneindia Telugu

    కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌తో భేటీ ముగిసిన త‌ర్వాత మీడియాతో మాట్లాడిన రాష్ట్ర మంత్రి నిరంజ‌న్ రెడ్డి.. తెలంగాణ రైతాంగ ప్ర‌యోజ‌నాల కోస‌మే కేంద్ర‌మంత్రిని క‌లిశామ‌న్నారు. మేము చాలా ఆశ‌తో ఈ స‌మావేశానికి వ‌చ్చాం. కానీ.. కేంద్ర ప్ర‌భుత్వం నిరాశే మిగిల్చిందని అన్నారు. స‌మావేశం అసంపూర్తిగా ముగిసిందని తెలిపారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్ర‌భుత్వం నుంచి సానుకూల నిర్ణ‌యం రాలేదని అన్నారు. గ‌త వారం కూడా కేంద్రం ఎటువంటి హామీ ఇవ్వ‌లేదని తెలిపారు. ఇప్పుడు కూడా ఎలాంటి హామీ ఇవ్వ‌లేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+