స్వలింగ సంపర్కుల వివాహాలపై కేంద్రం సంచలన నిర్ణయం- సుప్రీంకోర్టులో..!!

దేశంలో స్వలింగ వివాహాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేసింది.

న్యూఢిల్లీ: దేశంలో స్వలింగ సంపర్కుల వివాహ ప్రక్రియపై కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయి. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధతను కల్పించాలని, దీనికి అధికారిక గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ విషయంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. పలు పిటీషన్లు దాఖలయ్యాయి. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.

ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లపై విచారణ చేపట్టనుంది. ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టుతో సహా వివిధ రాష్ట్రాల్లోని ఉన్నత న్యాయస్థానాల ముందు పెండింగ్‌లో ఉన్న పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు క్రోడీకరించింది. వాటన్నింటినీ విచారణకు స్వీకరించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ అరుంధతీ కట్జూ తన వాదనలను వినిపించనున్నారు.

Centre opposes the legal recognition of same-sex marriage, files affidavit before the Supreme Court

హైకోర్టుల్లో పెండింగ్‌ లో ఉన్న స్వలింగ వివాహాల గుర్తింపు కోసం దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇదివరకే విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. జనవరి 6వ తేదీన వాటన్నింటినీ తమకు బదిలీ చేయాలని ఆదేశించింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించకుండా గత ఏడాది నవంబరులో సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులను జారీ చేసింది. స్వలింగ సంపర్కులు లేదా భిన్న లింగ సంపర్కులు పరస్పర అంగీకారంతో సెక్స్ చేయడం నేరం కాదని పేర్కొంది.

తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కును ఎల్‌జిబిటిక్యూ సామాజిక వర్గానికి ఉందని అప్పట్లో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీనిపై అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది సుప్రీంకోర్టు. దీనికి కేంద్ర ప్రభుత్వం తాజాగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే సుప్రీంకోర్టు అఫిడవిట్ ను దాఖలు చేసింది.

దేశంలో స్వలింగ సంపర్కుల వివాహాన్ని వ్యతిరేకిస్తోన్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి చట్టబద్ధతను కల్పించడం, అధికారికంగా గుర్తింపును ఇవ్వడం సరికాదని తేల్చి చెప్పింది. ఐపీసీలోని సెక్షన్ 377 ప్రకారం- స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవడం నేరమని తెలిపింది. స్వలింగ వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు అనేది చరిత్రలో లేదని వివరించింది. భిన్న లింగ వివాహానికి మాత్రమే గుర్తింపు ఉందని పేర్కొంది. కేంద్రం స్వలింగ వివాహాలను వ్యతిరేకించడానికి సామాజిక పరిస్థితులు కూడా అంగీకరించవని కేంద్రం పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+