విక్రమ్ పంపిన తొలి సమాచారం- చంద్రుడి దక్షిణ ధృవంపై టెంపరేచర్ డీటెయిల్స్ ఇవీ
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని తాను చేసుకోవడాన్ని మొదలు పెట్టింది.
ఇక రోవర్ ద్వార చంద్రుడి మీదికి పంపించిన పేలోడ్స్ అన్నీ కూడా సక్రమంగా పని చేస్తోన్నాయి. పేలోడ్స్ అన్నీ స్విచ్ ఆన్ అయ్యాయి. వాటి ద్వారా చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలానికి సంబంధించిన పూర్తి సమాచారం, డేటా బెంగళూరులోని ఇస్రో కమాండ్ కంట్రోల్ స్టేషన్‌కు అందడం ఆరంభమైంది.

రోవర్‌లో లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్, ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్‌ను పేలోడ్స్‌గా పంపించారు శాస్త్రవేత్తలు. ల్యాండర్ మాడ్యూల్ పేలోడ్స్ ఇండియన్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ ఇయానోస్ఫియర్, లేజర్ రెట్రోరెఫ్లెక్టర్, చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పరిమెంట్.. వంటి పరికరాలు తమ పని మొదలుపెట్టాయి. డేటాను సేకరిస్తోన్నాయి.
ఇందులో చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పరిమెంట్.. అనే పరికరం చంద్రుడి ఉపరితలం, భూ అంతర్భాగంలోని ఉష్ణోగ్రత వివరాలను సేకరించింది. వాటిని ఇస్రో కమాండ్ కంట్రోల్ స్టేషన్‌కు పంపించింది. ఈ వివరాలను ఇస్రో కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. చంద్రయాన్ 3 మిషన్‌ను ప్రయోగించిన తరువాత.. అక్కడి నుంచి అందిన తొలి సమాచారం ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 27, 2023
Here are the first observations from the ChaSTE payload onboard Vikram Lander.
ChaSTE (Chandra's Surface Thermophysical Experiment) measures the temperature profile of the lunar topsoil around the pole, to understand the thermal behaviour of the moon's… pic.twitter.com/VZ1cjWHTnd
చంద్రుడి ఉష్ణోగ్రతను కొలవడానికి 10 టెంపరేచర్ సెన్సర్లను ఈ థర్మోఫిజికల్ ఎక్స్‌పరిమెంట్‌కు ఫిట్ చేసింది ఇస్రో. ఈ సెన్సర్లు ఉష్ణోగ్రతను సంగ్రహించాయి. ఉపరితలంతో పాటు 10 సెంటీమీటర్ల దిగువన ఉండే టెంపరేచర్‌నూ గుర్తించింది. ఈ డేటాను కంట్రోల్ స్టేషన్‌కు పంపించింది. గ్రాఫ్ రూపంలో దీన్ని విడుదల చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. దీనిపై పూర్తిస్థాయి అధ్యయనం మొదలుపెట్టారు.
ఈ సెన్సర్లు, థర్మోఫిజికల్ ఎక్స్‌పరిమెంట పేలోడ్‌ను స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. చంద్రుడి ధృవాల వద్ద ఉండే ఉష్ణోగ్రతపై సమగ్ర అధ్యయనం సాగించడానికి ఇది ఉపయోగపడుతుందని ఇస్రో భావిస్తోంది.
ఇందులో చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పరిమెంట్.. అనే పరికరం చంద్రుడి ఉపరితలం, భూ అంతర్భాగంలోని ఉష్ణోగ్రత వివరాలను సేకరించింది. వాటిని ఇస్రో కమాండ్ కంట్రోల్ స్టేషన్‌కు పంపించింది. ఈ వివరాలను ఇస్రో కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. చంద్రయాన్ 3 మిషన్‌ను ప్రయోగించిన తరువాత.. అక్కడి నుంచి అందిన తొలి సమాచారం ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications