చంద్రుడి దక్షిణ ధృవంపై భారీ అగ్నిపర్వతాలు: నిర్ధారించిన ఇస్రో
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని తాను చేసుకోవడాన్ని మొదలు పెట్టింది.
రోవర్‌లో లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ (లిబ్స్), ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్‌ను పేలోడ్స్‌గా పంపించారు శాస్త్రవేత్తలు. ల్యాండర్ మాడ్యూల్ పేలోడ్స్ ఇండియన్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ ఇయానోస్ఫియర్, లేజర్ రెట్రోరెఫ్లెక్టర్, చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పరిమెంట్.. వంటి పరికరాలు తమ పని మొదలుపెట్టాయి. డేటాను సేకరిస్తోన్నాయి.

ఈ పేలోడ్స్‌లల్లో ఒకటైన లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ.. కీలక సమాచారాన్ని సేకరించింది. చందమామ దక్షిణ ధృవంపై రసాయన, ఖనిజ నిల్వలు భారీగా ఉన్నట్లు గుర్తించింది. ప్రత్యేకించి- సల్ఫర్ నిల్వలు భారీగా ఉన్నట్లు నిర్ధారించింది. దీనికి సంబంధించిన పూర్తి డేటాను ఇస్రోకు పంపించింది.
సల్ఫర్‌తో పాటు అల్యూమినియం, క్యాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని లిబ్స్ పేలోడ్ గుర్తించినట్లు ఇస్రో తెలిపింది. అత్యధిక శక్తి గల లేజర్ కిరణాలను లిబ్స్ ప్రసారం చేయగలదు. చంద్ర శిలలు, లేదా మట్టి లక్షణాలను తెలుసుకోవడానికి లిబ్స్‌ను వినియోగిస్తోంది ఇస్రో.
చంద్రుడి దక్షిణ ధృవంపై భారీగా సల్ఫర్ నిల్వలు ఉన్నాయనే విషయాన్ని మరోసారి నిర్ధారించుకుంది ఇస్రో. లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా మాత్రమే కాకుండా మరో కోణంలోనూ సల్ఫర్ నిల్వల గురించి ఆరా తీసింది. ఈ సారి ఆల్ఫా పార్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రోస్కోప్ ద్వారా సల్ఫర్ నిల్వలు ఉన్నాయనే నిర్ధారణకు వచ్చింది.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 31, 2023
In-situ Scientific Experiments
Another instrument onboard the Rover confirms the presence of Sulphur (S) in the region, through another technique.
The Alpha Particle X-ray Spectroscope (APXS) has detected S, as well as other minor elements.
This… pic.twitter.com/lkZtz7IVSY
మిగిలిన మూలకాలతో పోల్చుకుంటే సల్ఫర్ నిల్వలు పెద్ద ఎత్తున ఉండటం వెనుక గల సాంకేతిక అంశాలపై విశ్లేషణ మొదలు పెట్టింది ఇస్రో. సల్ఫర్ నిల్వలు ఉన్న ప్రాంతంలో అతి పెద్ద అగ్నిపర్వతాలు ఉండొచ్చనే అంచనా వేసింది. ఈ ప్రాంతంలోనే భారీగా ఉల్కాపాతం సంభవించి ఉండొచ్చని అభిప్రాయపడింది. తోకచుక్కలు చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొట్టడం వల్ల సల్ఫర్ ఏర్పడి ఉంటుందని పేర్కొంది.
18 సెంటీమీటర్ల ఎత్తు ఉండే ఈ ఆల్ఫా పార్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రోస్కోప్ పేలోడ్‌ను అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, స్పేస్ అప్లికేషన్ సెంటర్, బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేశాయి. ఆల్ఫా కణాలు, ఎక్స్-కిరణాలను విడుదల చేసే రేడియో ధార్మిక శక్తిని కలిగి ఉంటుంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications