Chandrayaan 3: చందమామను ఇలా ఊహించగలరా?- డోన్ట్ మిస్

బెంగళూరు: చంద్రుడిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో చేపట్టిన పరిశోధనలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. చంద్రయాన్ 3లో భాగంగా ఇస్రో పంపించిన విక్రమ్ ల్యాండర్.. నిద్రలోకి జారుకుంది. చంద్రుడిపై రాత్రి సమయం ఆరంభం కావడం దీనికి కారణం. అక్కడ ఒక్క రాత్రి గడిచిపోవడం అంటే.. భూమి మీద 14 రాత్రులతో సమానం.

విక్రమ్ ల్యాండర్‌ స్లీప్ మోడ్‌లోకి వెళ్లేలా ఈ ఉదయం 8 గంటలకు సమయాన్ని సెట్ చేసింది ఇస్రో. చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ (ఛాస్టే), రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్‌సెన్సిటివ్ అయానోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్- లాంగ్ముయిర్ ప్రోబ్ (రంభా ఎల్పీ),ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ (ఐఎల్ఎస్ఏ).. వంటి ఇన్-సిటు పేలోడ్స్ అన్నీ కూడా టర్న్ ఆఫ్ అయ్యాయి.

Chandrayaan 3: ISRO released 3d images of moons surface

ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ ఒక్కటే తన పని తాను చేసుకుంటుంది. చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఇస్రో కమాండ్ కంట్రోల్ స్టేషన్‌కు పంపిస్తోంది. సౌర విద్యుత్ ఆధారంగా పని చేసే బ్యాటరీని ఇందులో అమర్చారు శాస్త్రవేత్తలు. ఈ బ్యాటరీ ఛార్జ్ అయిపోయేంత వరకూ అది పని చేస్తూనే ఉంటుంది.

బ్యాటరీ ఛార్జింగ్ ఉన్నంత వరకూ యాక్టివ్ మోడల్‌లోనే ఉండే ప్రజ్ఞాన్ రోవర్.. తాజాగా చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన కొత్త ఫొటోలను విడుదల చేసింది. 3డీ- అనాగ్లిఫ్ ఫొటోలు ఇవి. పేలోడ్‌గా పంపించిన నావిగేషన్ కెమెరా వీటిని తీసింది. ఈ పేలోడ్‌ను ఇస్రోకు చెందిన ల్యాబొరేటరీ ఫర్ ఎలెక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ అభివృద్ధి చేసింది. స్పేస్ అప్లికేషన్ సెంటర్.. ఈ ఫొటోలను విశ్లేషించింది.

ఒక వస్తువు లేదా ఉపరితల ప్రాంతాన్ని స్టీరియో లేదా మల్టీ-వ్యూ ఫొటోలను త్రీడీ యాంగిల్‌లో చూసే విధానాన్ని అనాగ్లిఫ్‌గా పిలుస్తారు. తాజాగా ఇస్రో విడుదల చేసిన ఈ ఫొటోలు ఎరుపు, నీలం, ఆకుపచ్చ మిశ్రమంలో కనిపిస్తోన్నాయి. ఈ ఫొటోలను స్టీరియో ఎఫెక్ట్‌లోకి మార్చింది ఇస్రో. దీన్ని చూడటానికి రెండ్ అండ్ క్యాన్ గ్లాసెస్ అవసరమౌతాయని ఇస్రో సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+