Chandrayaan 3: ఇస్రో శాస్త్రవేత్తలకు గుడ్‌ న్యూస్..!!

బెంగళూరు: భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి ఇప్పుడే శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని తాను చేసుకోవడాన్ని మొదలు పెట్టింది.

తాజాగా మరో అప్‌డేట్‌ను వెలువడించింది. చంద్రుడి ఉపరితలంపై నడకను మొదలుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తొలి రోజున ఎనిమిది మీటర్ల పాటు ప్రయాణించింది. విక్రమ్ మాడ్యుల్ ర్యాంప్ మీదుగా కిందికి దిగిన తరువాత రోవర్ కొంత సమయం పాటు కదల్లేదు. ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికే దీన్ని కొంతసేపు పాజ్‌లో ఉంచారు ఇస్రో శాస్త్రవేత్తలు.

Chandrayaan 3: PM Modi to visit Bengalurus ISTRAC at 7:15 am on August 26

ఇక రోవర్‌ ద్వార చంద్రుడి మీదికి పంపించిన పేలోడ్స్ అన్నీ కూడా సక్రమంగా పని చేస్తోన్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు వివరించారు. పేలోడ్స్ అన్నీ స్విచ్ ఆన్ అయ్యాయని తెలిపారు. వాటి ద్వారా చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన పూర్తి సమాచారం, డేటా త్వరలో అందుతుందని పేర్కొన్నారు.

చంద్రయాన్ 3 మిషన్‌ను విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు తీపి కబురు అందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరుకు రానున్నారు. ఇస్రో కార్యాలయాన్ని సందర్శించనున్నారు. శనివారం ఉదయం 7:15 నిమిషాలకు బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకిండ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ కార్యాలయానికి చేరుకోనున్నారాయన. శాస్త్రవేత్తలను అభినందించనున్నారు.

ప్రస్తుతం మోదీ.. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా గ్రీస్‌కు బయలుదేరి వెళ్లారు. ఆ దేశ అధ్యక్షురాలు క్యాథరినా సక్కెరెపోలో, ప్రధానమంత్రి కిరియాకోస్ మిట్సెటకోస్‌తో భేటీ అయ్యారు.

ప్రస్తుతం ఆయన గ్రీస్‌లోనే ఉన్నారు. ఈ పర్యటనను ముగించుకుని నేరుగా బెంగళూరుకు చేరుకోనున్నారు ప్రధాని మోదీ. వైమానిక దళానికి చెందిన ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కానున్నారు. అక్కడి నుంచి నేరుగా ఇస్రో కమాండ్ నెట్‌వర్క్ కార్యాలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా వారిని సన్మానించనున్నారు మోదీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+