జాబిల్లి దక్షిణ ధృవంపై ల్యాండ్ మార్క్‌ను క్రియేట్ చేసిన రోవర్

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని తాను చేసుకోవడాన్ని మొదలు పెట్టింది.

రోవర్‌లో లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ (లిబ్స్), ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్‌ను పేలోడ్స్‌గా పంపించారు శాస్త్రవేత్తలు. ల్యాండర్ మాడ్యూల్ పేలోడ్స్ ఇండియన్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ ఇయానోస్ఫియర్, లేజర్ రెట్రోరెఫ్లెక్టర్, చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పరిమెంట్.. వంటి పరికరాలు తమ పని మొదలుపెట్టాయి. డేటాను సేకరిస్తోన్నాయి.

Chandrayaan 3: Pragan Rover has traversed over 100 meters

ఈ పేలోడ్స్‌లల్లో ఒకటైన లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ.. కీలక సమాచారాన్ని సేకరించింది. చందమామ దక్షిణ ధృవంపై రసాయన, ఖనిజ నిల్వలు భారీగా ఉన్నట్లు గుర్తించింది. ప్రత్యేకించి- సల్ఫర్ నిల్వలు భారీగా ఉన్నట్లు నిర్ధారించింది. దీనికి సంబంధించిన పూర్తి డేటాను ఇస్రోకు పంపించింది.

చందమామ గుట్ల మట్టను అన్వేషించే క్రమంలో ప్రజ్ఞాన్ రోవర్ సరికొత్త ల్యాండ్ మార్క్‌ను క్రియేట్ చేసింది. ల్యాండ్ అయిన రోజు నుంచి 100 మీటర్ల దూరం పాటు ప్రయాణించింది. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన శివశక్తి పాయింట్ వద్ద తన జర్నీని మొదలు పెట్టిన ఈ ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటివరకు 100 మీటర్ల దూరం నడించిందని ఇస్రో తెలిపింది. ప్రజ్ఞాన్ 100 నాటౌట్ అని అభివర్ణిస్తూ ట్వీట్ చేసింది.


ఈ వంద మీటర్ల ప్రయాణంలో ఇప్పటివరకు రోవర్ అనేక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దక్షిణ ధృవంపై అనేక ఖనిజ నిల్వలు ఉన్నాయనే విషయాన్ని నిర్ధారించింది. సల్ఫర్‌తో పాటు అల్యూమినియం, క్యాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని లిబ్స్ పేలోడ్ గుర్తించినట్లు ఇస్రో తెలిపింది.

చంద్రుడి దక్షిణ ధృవంపై భారీగా సల్ఫర్ నిల్వలు ఉన్నాయనే విషయాన్ని మరోసారి నిర్ధారించుకుంది ఇస్రో. లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా మాత్రమే కాకుండా మరో కోణంలోనూ సల్ఫర్ నిల్వల గురించి ఆరా తీసింది. ఈ సారి ఆల్ఫా పార్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రోస్కోప్ ‌ద్వారా సల్ఫర్ నిల్వలు ఉన్నాయనే నిర్ధారణకు వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+