Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విక్రమ్పై ఆశలు వదిలేసుకున్న ఇస్రో

బెంగళూరు: చంద్రుడిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో చేపట్టిన పరిశోధనలకు ఇక పుల్‌స్టాప్ పడినట్టే. చంద్రయాన్ 3లో భాగంగా ఇస్రో పంపించిన విక్రమ్ ల్యాండర్.. శాశ్వత నిద్రలోకి జారుకున్నట్టే కనిపిస్తోంది. చంద్రుడిపై రాత్రి సమయం ఆరంభమైనప్పటి నుంచే అది పని చేయడం మానేసింది.

విక్రమ్ ల్యాండర్‌‌ ద్వారా చంద్రుడిపైకి పంపించిన ప్రజ్ఞాన్ రోవర్, చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ (ఛాస్టే), రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్‌సెన్సిటివ్ అయానోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్- లాంగ్ముయిర్ ప్రోబ్ (రంభా ఎల్పీ),ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ (ఐఎల్ఎస్ఏ).. వంటి ఇన్-సిటు పేలోడ్స్ అన్నీ కూడా మూగబోయాయి.

Chandrayaan 3 updates: There is no chance at all, says former ISRO Chairman AS Kiran

పగటి సమయం ఆరంభమైన తరువాత వాటిన్నింటినీ యాక్టివేట్ చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. 14 రోజుల పాటు వారు ఆయా పేలోడ్స్‌ను యాక్టివ్ మోడ్‌లోకి తీసుకుని రావడానికి ప్రయత్నించారు గానీ అవి సఫలం కాలేదు. చంద్రుడిపై సూర్యకాంతి ప్రసరించడం ఆగిపోవడం, రాత్రి సమయం ఆరంభం కావడం వల్ల ల్యాండర్, రోవర్‌లో అమర్చిన సోలార్ బ్యాటరీలు డెడ్ అయ్యాయి.

వాటిని రీఛార్జ్ చేయగలిగితే మళ్లీ విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్, ఇతర పేలోడ్స్ అన్ని యాక్టివ్ అవుతాయని శాస్త్రవేత్తలు భావించారు. అది సాధ్యపడలేదు. చంద్రుడిపై మళ్లీ పగటి సమయం ముగిసింది. రాత్రి సమయం ఆరంభమౌతోంది. అంటే చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తరువాత రెండోసారి చీకటి కాబోతోందక్కడ.

అక్కడ ఒక్క రాత్రి గడిచిపోవడం అంటే.. భూమి మీద 14 రాత్రులతో సమానం. చంద్రుడు ఒకసారి భూమి చుట్టూ తిరిగి రావడానికి 28 రోజుల సమయం పడుతుందనే విషయం తెలిసిందే. ఇందులో 14 రోజులు సూర్యుడి వెలుగులో.. మరో 14 రోజులు చీకట్లో ఉంటుంది చందమామ. చీకటి రోజులు ఆరంభమైనప్పుడు చంద్రుడి ఉపరితలంపై తీవ్రమైన చలి ఆరంభమౌతుంది.

ఈ 14 రోజుల కాలంలో చంద్రుడి దక్షిణ ధృవంపై నమోదయ్యే ఉష్ణోగ్రత మైనస్ 230 డిగ్రీలు. చంద్రుడి ఈక్వేటర్ వద్ద చలి తీవ్రత కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఈక్వేటర్ సమీపంలో మైనస్ 208 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుంది. గడ్డ కట్టించే ఇంత తీవ్రమైన చలిని తట్టుకుని నిలిచే శక్తి ప్రజ్ఞాన్ రోవర్‌కు లేదు.

ఫలితంగా వాటిపై ఆశలు వదిలేసుకున్నామని ఇస్రో మాజీ ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ తెలిపారు. రెండోసారి రాత్రి సమయం ఆరంభం కానున్న ఈ పరిస్థితుల్లో చంద్రయాన్ 3 పేలోడ్స్ ఇక ముందు పని చేసే అవకాశాలు ఏ మాత్రం లేవని అంచనా వేశారు. ఇప్పటికే చంద్రుడిపై పూర్తిస్థాయి పరిశోధనలకు అవసరమైన అనేక కీలక విషయాలను చంద్రయాన్ పంపించందని వ్యాఖ్యానించారు.

ఈ డేటా భవిష్యత్తులో పలు కీలక పరిశోధనలకు అవసరమౌతాయని ఏఎస్ కిరణ్ కుమార్ అన్నారు. చంద్రయాన్ 3 సాధించిన ఈ విజయం విజ్ఞానపరంగా అనేక పరిశోధనలు, విస్తృత కార్యకలాపాలకు జీవం పోసిందని పేర్కొన్నారు. ఇదే మోడల్‌తో గగన్‌యాన్, శుక్రయాన్ వంటి ప్రయోగాలను విజయవంతం చేయొచ్చని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+