వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడురోజులు కంప్లీట్ లాక్‌డౌన్: వైరస్ విస్తరించడంతో అధికారుల చర్యలు.. ఎక్కడంటే...

|
Google Oneindia TeluguNews

లాక్‌డౌన్ వల్ల అహ్మదాబాద్‌లో నిబంధనలను మరింత కఠినతరం చేశారు. గుజరాత్ రాష్ట్రంలో ఇక్కడే వైరస్ వ్యాప్తి ఎక్కువ చెందుతుంది. దీంతో సిటీలో ఏడురోజుల పాటు పూర్తిగా లాక్ డౌన్ విధించారు. పాలు, మెడికల్ షాపులు తప్ప అన్ని దుకాణా సముదాయాలను మూసివేయాలని అడిషనల్ చీఫ్ సెక్రటరీ రాజీవ్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీచేశారు. సిటీలో పరిస్థితి దిగజారడంతో ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. కానీ ప్రజలు మాత్రం గందరగోళానికి గురవుతున్నారు.

 Chaos on streets as 7-day complete lockdown order in city..

గురువారం నుంచి వారం రోజులపాటు పూర్తిగా లాక్ డౌన్ అమలవుతోంది. లాక్ డౌన్ ఉత్తర్వులు జారీచేయడానికి ముందు అహ్మదాబాద్ మున్సిపల్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. వైరస్ వ్యాప్తి చెందుతోన్న క్రమంలో గురువారం ఉదయం 6 గంటల నుంచి వారం రోజుల పాటు కంప్లీట్ లాక్ డౌన్ అమలవుతోంది. మెడికల్ షాపు, పాల షాపులు తప్ప... కూరగాయాలు, పళ్లు, కిరాణా వస్తువులు, సూపర్ మార్కెట్లు, ఐస్ క్రీమ్ పార్లర్, స్విగ్గీ, జొమాటో, డొమినొస్ డెలివరీ చేసేందుకు అనుమతి లేదని స్పష్టంచేసింది. గుజరాత్ రాష్ట్రంలో 70 శాతం కేసులు ఇక్కడే నమోయ్యాయి. పలువురు వైరస్ సోకి చనిపోయారు.

Recommended Video

AP CM Jagan Launched Fishermen Bharosa Scheme, Rs 10,000 To Beneficiaries

ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ రూల్ 11 ప్రకారం చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. భౌతిక దూరం ముఖ్యమని పేర్కొన్నారు. ఉత్తర్వులు వెలువడ్డ వెంటనే ప్రజలు కూరగాయాలు, కిరాణా సామాను కోసం బయటకు వెళ్లారు. రెడ్ జోన్లలో ఉన్న బ్యాంకు కార్యాలయాలు కూడా పనిచేయవని పేర్కొన్నారు. కానీ ఏటీఎం మాత్రం పనిచేస్తాయని తెలిపారు.

English summary
Chaos reigned on Ahmedabad’s streets Wednesday, after the newly appointed team of bureaucrats placed in charge of the city decided to lock it down completely for a week from Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X