Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CG Assembly Elections 2023:ఆ విషయంలో ప్రధాని మోదీదే తొలిస్థానం: కాంగ్రెస్

Chattisgarh Assembly Elections 2023:ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు మాటలతో విరుచుకుపడుతున్న క్రమంలో అమీర్ ఖాన్ నటించిన గజినీ చిత్రం ప్రస్తావన కూడా వచ్చింది. సోమవారం రోజున మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కాంగ్రెస్ నేతలైన రాహుల్ గాంధీ, సీఎం భూపేష్ భగేల్‌లను గజినీతో పోల్చుతూ మండిపడ్డారు.అయితే ఫడ్నవీస్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ప్రధాని మోదీనే గజిని అంటూ రివర్స్ అటాక్ చేసింది కాంగ్రెస్.

రాయ్‌పూర్‌లో మాట్లాడిన దేవేందర్ ఫడ్నవీస్ రాహుల్ గాంధీని, సీఎం భూపేష్ భగేల్‌లను గజినీతో పోల్చారు. తాను గజిని సినిమా చూసినట్లు చెప్పిన ఫడ్నవీస్ అందులో సూర్య మెమొరీలాస్‌కు గురవుతాడని.. ఛత్తీస్‌గఢ్‌లో కూడా కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి వాటన్నిటినీ మర్చిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. కొత్తగా అబద్దాలను కాంగ్రెస్ అల్లుతోందని విమర్శించారు.

Chattisgarh Assembly Elections 2023:War of words between BJP and Congress,why Ghajini movie here

ఫడ్నవీస్‌కు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఛత్తీస్‌గఢ్ పీసీసీ ప్రతినిధి ధనంజయ్ సింగ్ ఠాకూర్ ఘాటు విమర్శలు చేశారు. అబద్ధాలు ఆడటంలో ఫడ్నవీస్ తొలి స్థానంలో నిలిచే ప్రయత్నం చేస్తున్నారని అయితే అబద్ధాలు అసత్యాల పోటీలో తొలి స్థానం ఎప్పటికీ ప్రధాని మోదీదే అన్న విషయం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం మరిచినట్లున్నారని సెటైర్ వేశారు.

అబద్ధాలు చెప్పడంలో బీజేపీ నేతలు ప్రధాని మోదీని మించలేరని ఎద్దేవా చేశారు ధనంజయ్ సింగ్ ఠాకూర్. బీజేపీ చెప్పిన అబద్దాలు విని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని చెప్పుకొచ్చారు.ఇక అసలైన గజిని ఛత్తీస్‌గఢ్‌కు నవంబర్ 4వ తేదీన రానున్నారని మోదీపై పరోక్ష విమర్శలు చేశారు. ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ హామీని గాలికొదిలేసిందని అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని చెప్పిన ఠాకూర్.. బీజేపీ నాయకులు అమ్నేషియా వ్యాధితో బాధపడుతున్నారని విమర్శించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+