వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న తొలిదశ పోలింగ్...దంతెవాడలో నక్సల్స్ దాడి

|
Google Oneindia TeluguNews

Recommended Video

ప్రారంభమై!న ఛత్తీస్‌గఢ్‌ తొలిదశ పోలింగ్...! | Oneindia Telugu

ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. తొలి దశలో 18 జిల్లాల్లోని 18 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ స్థానాలన్నీ నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. పోలింగ్ కంటే ముందే నక్సల్స్ తమ ఉనికిని చాటుతున్నారు. దంతెవాడ జిల్లాలోని కతెకల్యాణ్‌లో మావోయిస్టులు బాంబులు పేల్చారు. సీఆర్‌పీఎఫ్ బలగాలు నయనార్ గ్రామంలోని ఓ పోలింగ్ బూత్‌కు చేరుకుంటున్న క్రమంలో ఈ బాంబు దాడి జరిగింది. అయితే ఇందులో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

10 స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం

10 అసెంబ్లీ స్థానాలకు ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. ఈ స్థానాలన్నీ బస్తర్ మరియు రాజ్‌నందన్‌గావ్‌ జిల్లాలో ఉన్నాయి. ఈప్రాంతంలో మావోల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో అధికారులు దాదాపు లక్ష మంది భద్రతా సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాదు పోలింగ్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా హెలికాఫ్టర్‌ను ఏర్పాటు చేశారు. మిగతా 8 స్థానాలకు గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.

ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలి: మోడీ

ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలి: మోడీ

ఇదిలా ఉంటే ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని... ఓటు హక్కు ఉన్న వారంత వచ్చి తమ ఓటును వేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఓట్ల పండగని చెప్పిన ప్రధాని పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలి రావాలని ట్వీట్ చేశారు. ఇక చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల నేపథ్యంలో మావోలు 6 సార్లు దాడి చేయగా అందులో 14 మంది మృతి చెందారు.

2013లో ఈ 18 స్థానాల్లో 12 స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్

ఇక ఈ 18 స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడుతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 18 స్థానాలకు గాను 12 స్థానాలను గెలుచుకుంది. ఆ ఎన్నికలకు ఒక నెల ముందు మావోలు చేసిన దాడిలో 25 మంది మృతి చెందారు. ఇందులో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మృతి చెందారు. అయితే ఈ సారి పోటీ బీజేపీ కాంగ్రెస్‌కే పరిమితం కాలేదు. ఛత్తీస్‌గఢ్ రాష్ట మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ పార్టీ జనతా కాంగ్రెస్, మాయావతి పార్టీ బీఎస్పీలు ప్రభుత్వాన్ని డిసైడ్ చేసే అవకాశం ఉందని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు.

English summary
Voting began in 18 seats spread over eight districts in Chhattisgarh on Monday, in the first phase of the assembly election, as suspected Maoists triggered an IED blast in Katekalyan area in Dantewada.Officials said the blast through an improvised explosive device in Nayanar village occurred when troops of the 195 Battalion of the Central Reserve Police Force (CRPF) were approaching a polling booth. No injury to the personnel was reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X